OnePlus 9: వన్ ప్లస్ 9ఆర్ సేల్ తేదీ వచ్చేసింది.. 9 సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఇదే.. అద్భుతమైన ఫీచర్స్‌

OnePlus 9R Amazon Sale: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ ప్లస్‌ ఇటీవలే 9 సిరీస్‌లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో వన్ ప్లస్ 9ఆర్ స్మార్ట్ ఫోన్ సేల్ ఈ నెల 14వ తేదీ ...

OnePlus 9: వన్ ప్లస్ 9ఆర్ సేల్ తేదీ వచ్చేసింది.. 9 సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఇదే.. అద్భుతమైన ఫీచర్స్‌
Oneplus
Follow us
Subhash Goud

| Edited By: Shiva Prajapati

Updated on: Apr 14, 2021 | 9:11 AM

OnePlus 9R Amazon Sale: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ ప్లస్‌ ఇటీవలే 9 సిరీస్‌లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో వన్ ప్లస్ 9ఆర్ స్మార్ట్ ఫోన్ సేల్ ఈ నెల 14వ తేదీ నుంచి జరగనుంది. మొదట ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ జరగనుంది. సాధారణ వినియోగదారులకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు.

వన్ ప్లస్ 9ఆర్ ధర

అయితే ఈ మొబైళ్లలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999గా ఉండగా, వన్ ప్లస్ 9ఆర్‌ కార్బన్ బ్లాక్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయింది.

వన్ ప్లస్ 9ఆర్ స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11పై ఈ ఫోన్ రన్‌ అవుతుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను ఉండగా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో వన్ ప్లస్ అందించింది.

కెమెరాలు..

ఇక మొబైల్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతో పాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనో క్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

బ్యాటరీ సామర్థ్యం..

4500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో ఉంది. వార్ప్ 65టీ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇవీ చదవండి: REALME C20: తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? అయితే రియల్‌ మీ బెస్ట్‌ ఆప్షన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

Thunderstorms Effect: పిడుగుపాటును తప్పించుకోవచ్చా…? ఆసక్తికరమైన విషయాలు చదివితే షాకే !

Adani Group Flipkart: భారత్‌లో మరో భారీ బిజినెస్‌ డీల్‌.. అదానీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌..