Adani Group Flipkart: భారత్‌లో మరో భారీ బిజినెస్‌ డీల్‌.. అదానీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌..

Adani Group Flipkart: భారత్‌లో మరో భారీ వ్యాపార ఒప్పందానికి బీజం పడింది. ఇండియాలో లాజిస్టిక్స్‌కు పెట్టింది పేరైన అదానీ గ్రూప్‌తో ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్స్‌ కీలక ఒప్పందం చేసుకుంది. తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకునే...

Adani Group Flipkart: భారత్‌లో మరో భారీ బిజినెస్‌ డీల్‌.. అదానీ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌..
Flipkart Adani Group
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 13, 2021 | 3:48 PM

Adani Group Flipkart: భారత్‌లో మరో భారీ వ్యాపార ఒప్పందానికి బీజం పడింది. ఇండియాలో లాజిస్టిక్స్‌కు పెట్టింది పేరైన అదానీ గ్రూప్‌తో ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్స్‌ కీలక ఒప్పందం చేసుకుంది. తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకునే క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్స్‌తో పాటు డేటా సెంటర్ల సామార్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అదానీ గ్రూప్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం విలువ భారీగా ఉంటుందని తెలుస్తున్నప్పటికీ ఎంతా అనే విషయం మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ ఒప్పందం ప్రకారం అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న అదానీ లాజిస్టిక్స్‌ సంస్థతో కలిసి ఫ్లిప్‌కార్టు తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోనుంది. దీని ద్వారా ఫ్లిప్‌ కార్టు సరఫరాను మరింత మెరుగు పరుచుకోవాలనే ఆలోచనతో ఉంది. కేవలం ట్రాన్స్‌పోటేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా డేటా సెంటర్‌ పరిధి కూడా పెంచుకోనుంది. ఇందులో భాగంగానే చెన్నైలో ఉన్న అదానీ కనెక్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌ తన మూడో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఇదే విషయాన్ని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్విట్టర్‌ వేదికగా తెలియజేశాడు. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘ప్రముఖ ఈ కామెర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఇకపై మా సరికొత్త వ్యూహాత్మక భాగస్వామి. అదానీ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ ముంబైలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్స్‌ హబ్‌లో 5.34 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ (వేర్‌హౌస్‌)ను ఫ్లిప్‌కార్ట్‌కు లీజుకు ఇవ్వనున్నాం. ఈ కారణంగా ముంబయిలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి’ అంటూ రాసుకొచ్చారు.

గౌతమ్ అదానీ చేసిన ట్వీట్..

Also Read: Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?

China New Conspiracy: సరిహద్దులో చైనా మరో కుట్ర.. టిబెట్ ఏరియాలో కొత్త ప్రాజెక్టుకు డ్రాగన్ శ్రీకారం

Jwala Gutta-Vishnu Vishal: పెళ్లిపీటలెక్కనున్న బ్యాట్మెంటన్ స్టార్.. వెడ్డింగ్ డేట్ చెప్పేసిన గుత్తా జ్వాలా