Ola E- Scooter: ఓలా స్కూటర్లపై అదిరే ఆఫర్.. ఏకంగా రూ. 25,000 వరకూ తగ్గింపు..
మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఓలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఓ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. వాలెంటైన్స్ డే బహుమతిగా అభివర్ణిస్తూ ఓ ప్రత్యేక డిస్కౌంట్ ను ప్రకటించింది. తన అన్ని వేరియంట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఏకంగా రూ. 25,000 తగ్గింపును అందిస్తోంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహన శ్రేణికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ఓలా ఎలక్ట్రిక్.. ఈ విభాగంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ టూ వీలర్ల విక్రయాలు చేస్తూ సత్తా చాటుతోంది. అత్యాధునిక సాంకేతికత, టాప్ క్లాస్ ఫీచర్లు, అధిక పనితీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఓలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఓ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. వాలెంటైన్స్ డే బహుమతిగా అభివర్ణిస్తూ ఓ ప్రత్యేక డిస్కౌంట్ ను ప్రకటించింది. తన అన్ని వేరియంట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఏకంగా రూ. 25,000 తగ్గింపును అందిస్తోంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఇది ఈ ఆఫర్ ఫిబ్రవరి నెల మొత్తం ఉంటుందని పేర్కొన్నారు. మీరు కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఇదే సరైన సమయం. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎక్స్ పోస్ట్ ఇది..
అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో ఈ ఆఫర్ గురించి పోస్ట్ చేస్తూ తమ కస్టమర్లకు ఇది “వాలెంటైన్స్ డే బహుమతి”గా అభివర్ణించారు. సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్(ఐసీఈ) ఇంజిన్ వాహనాలను తగ్గించే దిశగానే ఈ చర్యలు తీసుకుంటూ తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో అనేక ఇ-స్కూటర్ మోడల్‌లు ఉన్నాయి. ఎస్1ఎక్స్ ప్లస్, ఎస్1ఎక్స్ (3కేడబ్ల్యూహెచ్), ఎస్1ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్), ఎస్1ఎక్స్ (2కేడబ్ల్యూహెచ్), ఎస్1 ప్రో (2వ తరం), ఎస్1ఎయిర్. ఈ మోడళ్లపై కొత్త ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా ఓలా సేల్స్ మరోసారి పెంచుకోవాలని చూస్తోంది.
You asked, we delivered! We’re reducing our prices by upto ₹25,000 starting today for the month of Feb for all of you!! Breaking all barriers to #EndICEage!
Valentine’s Day gift for all our customers 🙂❤️🇮🇳 pic.twitter.com/oKFAVzAWsC
— Bhavish Aggarwal (@bhash) February 16, 2024
ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, కంపెనీ తన మార్కెట్ వాటాలో గణనీయమైన పెరుగుదలను చూసిందని.. డిసెంబర్, జనవరి మధ్య 30% నుంచి దాదాపు 40% వరకు పెరిగిందని చెప్పారు. ఈ మార్కెట్ వాటాను కంపెనీ కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశంలో ఈవీల వ్యాప్తిని పెంచడమే కంపెనీ ప్రాథమిక లక్ష్యం అని ఖండేల్వాల్ నొక్కిచెప్పారు. తమ వ్యూహం నెలవారీ డిస్కౌంట్లను అందించడం కాదని, నిర్మాణ వ్యయం తగ్గింపుపై ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో దాని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బలమైన విక్రయాలను కూడా ఆయన హైలైట్ చేశారు. ఇది వారి ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది. వినియోగదారుల డిమాండ్‌లను తీర్చడానికి కంపెనీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, వినియోగదారులకు వారు కోరుకున్నది బహుమతిగా ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటామని ఆయన చెప్పుకొచ్చారు.
ఫిబ్రవరి 16 నుంచి ధరల వివరాలు ఇవి..
- ఓలా ఎస్1 ప్రో అసలు ధర రూ. 1,47,499కాగా ఆఫర్ పై రూ. 1,29,999కే దక్కించుకోవచ్చు.
- ఓలా ఎస్1 ఎయిర్ అసలు ధర రూ. 119,999కాగా.. ఆఫర్ పై రూ. 1,04,999కే కొనుగోలు చేయొచ్చు.
- ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) అసలు రూ. 1,09,999కాగా దీనిపై ఎటువంటి ఆఫర్ లేదు.
- ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 3 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ అసలు ధర రూ. 1,09,999కాగా ఆఫర్ పై రూ. 84,999కే కొనుగోలు చేయొచ్చు.
- ఓలాఎస్1 ఎక్స్(3కేడబ్ల్యూహెచ్) వేరియంట్ ను రూ. 89,999కే కొనుగోలు చేయొచ్చు. అలాగే ఓలా ఎస్1 ఎక్స్(2 కేడబ్ల్యూహెచ్) స్కూటర్ ను రూ. 79,999కే కొనుగోలు చేయొచ్చు.
టాటా మోటార్స్ కూడా..
ఫిబ్రవరి 13న, టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మోడళ్లకు ధర తగ్గింపులను ప్రకటించిన మొదటి భారతీయ వాహన తయారీ సంస్థగా అవతరించింది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా అమ్మకాలను పెంచడానికి యూఎస్లో కొన్ని మోడల్ వై కార్ల ధరలను తాత్కాలికంగా తగ్గించిన ఒక రోజు తర్వాత టాటా ఈ నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ తగ్గిన బ్యాటరీ ధర కారణంగా ధరను తగ్గించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








