UPI: అకౌంట్ లేకపోయినా… యూపీఐ పేమెంట్స్. కొత్త ఫీచర్..
డెలిగేట్ పేమెంట్స్‌గా ఈ కొత్త ఫీచర్‌ను పేర్కొంటున్నారు. ఇంతకీ ఫీచర్ ఉపయోగం ఏంటి.? ఎవరికి లబ్ధి చేకూరుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో ఇంట్లో ఉన్న వారంతా ఒకే యూపీఐ ఐడీతో పేమెంట్స్ చేసుకోవచ్చు...

ప్రస్తుతం దేశంలో యూపీఐ సేవలకు భారీగా ఆదరణ పెరిగింది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) తాజాగా యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్ లేని వారు కూడా యూపీఐ సేవలను ఉపయోగించుకునే విధంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఒకరి యూపీఐ అకౌంట్‌ను మరొకరు వాడుకునేందుకు వీలుగా యూపీఐ సర్కిల్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.
డెలిగేట్ పేమెంట్స్‌గా ఈ కొత్త ఫీచర్‌ను పేర్కొంటున్నారు. ఇంతకీ ఫీచర్ ఉపయోగం ఏంటి.? ఎవరికి లబ్ధి చేకూరుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో ఇంట్లో ఉన్న వారంతా ఒకే యూపీఐ ఐడీతో పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో కుటుంబ మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. యూపీఐ యాప్స్, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునే క్రమంలో.. ప్రైమరీ యూపీఐ హోల్డర్‌కు బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉంటుంది. ప్రైమరీ యూపీఐ హోల్డర్ ఇందుకోసం తన కాంటాక్ట్‌లోని నచ్చిన నెంబర్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రైమరీ యూజర్ గరిష్టంగా ఐదుగురిని ఎంచుకోవచ్చు. సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ అకౌంట్‌ను మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది. సెకండరీ యూజర్ల చెల్లింపులకు సంబంధించి పరిమితిని విధించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానంలో నెలకు గరిష్టంగా రూ. 15 వేల వరకు ఉపయోగించుకోవచ్చు.
సెకండరీ యూజర్లు చేసే ట్రాన్సాక్షన్స్ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ యూపీఐ యాప్, బ్యాంక్ ఖాతాలో కనిపిస్తాయి. దీంతో సెకండీ యూజర్లు దేనికి ఖర్చు చేస్తున్నారో ప్రైమరీ యూజర్ తెలుసుకోవచ్చు. చెల్లింపులకు సంబంధించి ప్రైమరీ యూజర్ సెకండరీ యూజర్లకు అనుమతులు ఇచ్చేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. పూర్తిగా డిలిగేషన్ ఇస్తే.. సెకండరీ యూజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్‌ను ప్రతిసారీ ప్రైమరీ యూజర్ ఆమోదించేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




