Zomato: జొమాటోలో ‘గ్రూప్‌ ఆర్డరింగ్‌’ ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?

అయితే ప్రతీ సారి ఇలా అందరినీ కనుక్కొని ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం ఇబ్బందితో కూడుకున్న అంశం. ఇందుకోసమే ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌ ఆర్డరింగ్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి ఆర్డర్‌ చేసేందుకు వీలు కల్పించేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు...

Zomato: జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
Zomato
Follow us

|

Updated on: Aug 17, 2024 | 9:00 PM

ఆదివారం వచ్చినా, ఏదైనా పండగ వచ్చినా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం ఒక ట్రెండ్‌. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకచోట చేరితే ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం సర్వ సాధరణం. అయితే గ్రూప్‌లోని సభ్యులందరికీ ప్రత్యేకమైన ఇష్టాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫుడ్‌ను ఇష్టపడుతుంటారు. ఇలా ప్రతీ ఒక్కరికి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో కనుక్కొని ఆర్డర్‌ చేస్తుంటారు.

అయితే ప్రతీ సారి ఇలా అందరినీ కనుక్కొని ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం ఇబ్బందితో కూడుకున్న అంశం. ఇందుకోసమే ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌ ఆర్డరింగ్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి ఆర్డర్‌ చేసేందుకు వీలు కల్పించేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ ఈ విషయాన్ని ‘‘ఎక్స్‌’’ వేదికగా తెలిపారు. గ్రూప్‌ ఆర్డరింగ్ ఫీచర్‌ సహాయంతో.. ఫుడ్‌ ఆర్డర్‌ చేసే సమయంలో కార్ట్‌లో మీ స్నేహితులందరినీ భాగస్వామ్యం చేయొచ్చు. దీని కోసం గ్రూప్‌ ఆర్డర్‌లో ఉండే లింక్‌ను వారికి పంపాల్సి ఉంటుంది. ఆ లింక్‌ సాయంతో ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన ఫుడ్‌ ఐటమ్స్‌ను కార్ట్‌లో యాడ్‌ చేస్తారు. దీంతో ఎవరికి నచ్చిన ఫుడ్‌ను వారే స్వయంగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొందరికి అందుబాటులోకి తీసుకురాగా త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతోనే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే గ్రూప్‌ ఆర్డర్‌లానే చెల్లింపులను కూడా పంచుకొనే ఫీచర్‌ను తీసుకురావాలని కొందరు యూజర్లు నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు గోయల్ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
తంగళాన్ సినిమాలో మాళవిక పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..
తంగళాన్ సినిమాలో మాళవిక పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..
'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం నాని ఏం చేశాడంటే?
'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం నాని ఏం చేశాడంటే?
శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా స్టార్ట్..
శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా స్టార్ట్..
ప్రభాస్‌-హను మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌.. అదిరిపోయే డీటెయిల్స్‌..
ప్రభాస్‌-హను మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌.. అదిరిపోయే డీటెయిల్స్‌..
వరలక్ష్మి వ్రతం స్పెషల్.. లంగా ఓణీలో మెరిసిన శ్రీముఖి.. ఫొటోస్
వరలక్ష్మి వ్రతం స్పెషల్.. లంగా ఓణీలో మెరిసిన శ్రీముఖి.. ఫొటోస్
అకౌంట్‌ లేకపోయినా... యూపీఐ పేమెంట్స్‌. కొత్త ఫీచర్‌..
అకౌంట్‌ లేకపోయినా... యూపీఐ పేమెంట్స్‌. కొత్త ఫీచర్‌..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్త్రీ విశ్వరూపం
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్త్రీ విశ్వరూపం
ఆడియన్స్‌ను ఫిదా చేసేందుకు టాలీవుడ్‌ బాటలో కోలీవుడ్‌ మేకర్స్..
ఆడియన్స్‌ను ఫిదా చేసేందుకు టాలీవుడ్‌ బాటలో కోలీవుడ్‌ మేకర్స్..