Blinkit: తోబుట్టువులకు రాఖీలు పంపడం మరింత సులువు.. బ్లింకిట్‌లో ఇంటర్నేషన్ ఆర్డర్లు
రాఖీ పండుగకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఇప్పటికే తమ తోబుట్టువులకు రాఖీలు కట్టేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు తమ సోదరుల వద్దకు వెళ్లేందుకు ప్రయాణాలు కూడా షురు చేశారు. అయితే విదేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి.? వీడియో కాల్స్‌లో మాట్టాడుకొని విషెస్ చెప్పుకోవడం వరకు...

రాఖీ పండుగకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఇప్పటికే తమ తోబుట్టువులకు రాఖీలు కట్టేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు తమ సోదరుల వద్దకు వెళ్లేందుకు ప్రయాణాలు కూడా షురు చేశారు. అయితే విదేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి.? వీడియో కాల్స్‌లో మాట్టాడుకొని విషెస్ చెప్పుకోవడం వరకు మాత్రమే పరిమితం కదూ! అయితే ఇలాంటి వారి కోసమే ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కొత్త సేవలను తీసుకొచ్చింది.
విదేశాల్లో ఉన్న వారు తమ తోబుట్టువులకు రాఖీలు, బహుమతులు పంపేందుకు ఈ సేవలను ప్రారంభించారు. ఈ విషయాన్ని బ్లింకిక్ కో ఫౌండర్, సీఈవో అల్బీందర్ ధిండ్సా ఎక్స్ వేదికగా తెలిపారు. విదేశాల్లో ఉన్న వారు భారత్‌లో ఉన్న తమ సోదరరులకు/సోదరీమణులకు బహుమతులు, రాఖీలు పంపించుకునేందుకు వీలుగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అమెరికా, కెనడా, నెథర్‌లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాల్లో ఉన్న వారు మాత్రమే ఈ ఆర్డర్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
Raksha Bandhan special – we’ve switched on international orders on Blinkit till 19th August.
Folks living abroad can now place orders on Blinkit to send Rakhis and gifts to their siblings in India and we’ll deliver in 10 minutes! 💛
Countries from where you can order – USA,… pic.twitter.com/Gmey0DYTjC
— Albinder Dhindsa (@albinder) August 17, 2024
బ్లింకిట్ ఇంతకు ముందు అందిస్తున్న అన్ని సేవల్లో లాగే వీటిని కూడా కేవలం 10 నిమిషాల్లోనే ఆర్డర్ డెలివరీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాఖీలు, స్వీట్స్, గిఫ్ట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆ సేవలు ఆగస్టు 19వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. పర్‌ఫ్యూమ్స్, ఫుడ్ ఐటమ్స్, పెన్నులు, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి గిఫ్టులను పంపించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




