Dating App Scam: నిండా ముంచిన డేటింగ్ యాప్.. వ్యాపారవేత్తను బుట్టలో వేసుకున్న మహిళ.. రూ.6.5 కోట్ల మోసం!
Dating App Scam: ఈ రోజుల్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా బురిడి కొట్టిస్తున్నారు. డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన ఓ మహిళ ఓ వ్యక్తిని నిండా ముంచేసేలా చేసింది. ఏకంగా రూ.6.5 కోట్లకుపైగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈ రోజుల్లో చాలా మంది ప్రేమను వెతుక్కుంటూ డేటింగ్ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వారు చెప్పినట్లుగా, “ప్రేమించడం అంత సులభం కాదు. దీనిని అర్థం చేసుకోలేక నిండా మునగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతోంది. నోయిడాకు చెందిన ఒక వ్యక్తి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాడు. అతను డేటింగ్ యాప్ కారణంగా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.
రూ.6.5 కోట్ల మోసం:
మోసగాళ్ళు నోయిడా నివాసిని రూ.6.5 కోట్లు మోసం చేశారు. అతనికి ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒక మహిళ పరిచయమైంది. ఆ మహిళ అతన్ని ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టమని ప్రలోభపెట్టి వలలో వేసింది. నోయిడాలోని సెక్టార్-36లో నివసిస్తున్న వ్యాపారవేత్త, ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ యజమాని దల్జీత్ సింగ్ బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుభవం లేకపోయినా భారీ లాభాలు ఆర్జించవచ్చని చెప్పి ఆ మహిళ తనను ఆకర్షించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Ms Dhoni Daughter: ఎంఎస్ ధోని కూతురు ఏ స్కూల్‌లో చదువుతుంది? ఫీజు ఎంతో తెలిస్తే షాకవుతారు!
దల్జిత్ ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 2024లో అతనికి డేటింగ్ యాప్‌లో అనితా చౌహాన్ అనే మహిళ పరిచయం ఏర్పడింది. దీని తరువాత ఆ మహిళ అతన్ని ఒక ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టమని ఒప్పించింది. రూ. 3.2 లక్షల ప్రారంభ పెట్టుబడితో దల్జీత్ రూ. 24,000 లాభం పొందాడు. ఇది అతని విశ్వాసాన్ని పెంచింది. దీని తరువాత అతను వివిధ బ్యాంకు ఖాతాలకు రూ. 6.52 కోట్లను బదిలీ చేశాడు. అంతేకాదు మరింత పెట్టుబడి కోసం రూ.2 కోట్ల రుణం తీసుకోవాలని ఒప్పించింది ఆ మహిళ. 30కి పైగా లావాదేవీలు, మొత్తం రూ.6.5 కోట్లు 25 వేర్వేరు ఖాతాలకు బదిలీ జరిగింది.
ఇక్కడే సమస్య మొదలైంది:
అతను SpreadMKT, Spprecdex.cc ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుండి తన డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు సమస్య ప్రారంభమైంది. ఆ ప్లాట్‌ఫామ్ 30 శాతం సెక్యూరిటీ ఫీజు, అదనంగా రూ. 61 లక్షల ఎక్స్ఛేంజ్ సర్వీస్ ఫీజు డిమాండ్ చేసినప్పుడు దల్జీత్‌కు అనుమానం వచ్చింది. ఇప్పుడు అతను పోలీసులను సంప్రదించి అన్ని లావాదేవీల వివరాలను, నిందితురాలు సంప్రదింపు వివరాలను పోలీసులకు ఇచ్చాడు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది:
ఈ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ సైబర్ క్రైమ్ ప్రీతి యాదవ్ తెలిపారు. మోసగాళ్ళు దొంగిలించిన డబ్బును ఏయే ఖాతాలకు బదిలీ చేశారో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. లావాదేవీలను ట్రాక్ చేయడానికి సంబంధిత బ్యాంకుల నుండి అధికారులు సమాచారాన్ని అభ్యర్థించారు. తదుపరి దర్యాప్తులో ఆ మహిళ ప్రొఫైల్ నకిలీదని తేలింది. పోలీసులు ఇప్పుడు నేరస్థులను గుర్తించి, దొంగిలించిన నిధులను తిరిగి పొందే పనిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Gold Price: భారతదేశంలో కంటే ఏ దేశాల్లో బంగారం చౌకగా ఉంటుంది..? కారణం ఏంటి?
ఇది కూడా చదవండి: Tech Tips: మీ మొబైల్‌ను ఎవరైనా దొంగిలించారా? ముందుగా ఈ 3 పనులు చేయండి.. డేటా సేఫ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








