Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Cars: కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు.. త్వరలోనే లాంచ్‌కు సిద్ధం..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ అమ్మకాలు దూసుకుపోతున్నాయి. ఈవీ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి నేపథ్యంలో డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అలాగే మెరుగైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఈవీ కార్ల అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా కంపెనీలు ఈవీ వెర్షన్ల కార్లను లాంచ్ చేస్తున్నాయి.

Electric Cars: కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు.. త్వరలోనే లాంచ్‌కు సిద్ధం..!
Ev Cars
Follow us
Srinu

|

Updated on: Mar 30, 2025 | 5:30 PM

భారతదేశంలో హోండా, టయోటా, జీప్ వంటి కొన్ని కంపెనీలు ఇంకా ఈవీ వాహనాలను లాంచ్ చేయలేదు. అయితే చాలా మెజారిటీ కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. రాబోయే నెలల్లో దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి మోడళ్లతో సహా మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి. త్వరలో భారతదేశంలోకి ప్రవేశించనున్న ఎలక్ట్రిక్ వాహనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఈ-విటారా

మారుతి సుజుకికి సంబంధించిన ఈ-విటారా బ్రాండ్‌కు సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 సందర్భంగా ఆవిష్కరించారు. ఈ మోడల్ కారును పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు 142 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 192.5 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ లాంచ్‌తో మారుతి సుజుకి భారతీయ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రంగంలో అగ్రస్థానాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎంజీ ఎం9

ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ అయిన ఎంజీ ఎం9ను కూడా ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఈ కారు కూడా త్వరలో భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. మాక్సస్ మిఫా 9 ఆధారంగా ఈ ఎంపీవీ ఆటోమేకర్‌కు సంబంధించిన ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ అయిన ఎంజీ సెలెక్ట్ ద్వారా విక్రయిస్తారు. ఎంజీ ఎం9 సెవెన్ సీటర్‌తో లాంచ్ చేయనున్నారు. 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 430 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 

ఇవి కూడా చదవండి

టాటా హారియర్ ఈవీ 

టాటా హారియర్ ఈవీ భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది. ఇప్పటికే ఈ కారు ఐసీఈ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న హారియర్ త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టాటా హారియర్ ఈవీ ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన కొన్ని డిజైన్ అప్‌డేట్స్‌తో రానుంది. అలాగే డ్యూయల్-మోటార్ సెటప్, ఆల్-వీల్ డ్రైవ్ వంటి అధునాతన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. టాటా మోటార్స్ త్వరలో పవర్‌ట్రెయిన్ వివరాలను తెలిపే అవకాశం ఉంది. 

ఎంజీ సైబర్‌స్టర్

ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ కారు టూ డోర్ స్పోర్ట్స్ వెర్షన్‌లా లాంచ్ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు అధునాతన సాంకేతికతలతో నిండిన అప్‌స్కేల్ ఇంటీరియర్‌ను కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తినిస్తుంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎంజీ సైబర్‌స్టర్ 503 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 725 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ]

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వీటి కూలింగ్ ముందు ఏసీలు పనిచేయవ్.. టెర్రకోటతో కొత్త టెక్నాలజీ
వీటి కూలింగ్ ముందు ఏసీలు పనిచేయవ్.. టెర్రకోటతో కొత్త టెక్నాలజీ
ఆర్థిక ఇబ్బందులు వల్ల అలాంటివి చేశా.. ఇప్పుడు చేయడం లేదు..
ఆర్థిక ఇబ్బందులు వల్ల అలాంటివి చేశా.. ఇప్పుడు చేయడం లేదు..
ఇకపై భారత్, పాక్ మ్యాచ్‌లుండవ్.. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆడేదిలే
ఇకపై భారత్, పాక్ మ్యాచ్‌లుండవ్.. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆడేదిలే
వేసవిలో తలనొప్పి రావడానికి మెయిన్ కారణం ఇదే
వేసవిలో తలనొప్పి రావడానికి మెయిన్ కారణం ఇదే
10th ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. 600కి 600 మార్కులు వచ్చాయ్!
10th ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. 600కి 600 మార్కులు వచ్చాయ్!
ఉగ్రభయం..రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.ఏం జరిగిందంటే
ఉగ్రభయం..రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.ఏం జరిగిందంటే
భారత్ ప్రతిజ్ఞతో వణుకుతోన్న పాక్.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్
భారత్ ప్రతిజ్ఞతో వణుకుతోన్న పాక్.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్
ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.?
ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.?
రానున్న పదేళ్లలో తులం బంగారం ధర ఇలా ఉంటుంది.. !
రానున్న పదేళ్లలో తులం బంగారం ధర ఇలా ఉంటుంది.. !
చెన్నై పతనానికి 4 అసలు కారణాలు! 2025లో కూలిన CSK రాజ్యం!
చెన్నై పతనానికి 4 అసలు కారణాలు! 2025లో కూలిన CSK రాజ్యం!