Best Bikes: ఈ 5 బైక్‌లు అంటే జనాలకు పిచ్చి.. మార్కెట్లో భారీ డిమాండ్..!
Best Bikes: ప్రస్తుతం మార్కెట్లో హవా కొనసాగుతోంది. కొన్ని బైక్‌లు జనాల హృదయాల్లో నిలిచిపోతున్నాయి. ఇలాంటి బైక్‌లకు మార్కెట్లో భలే క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బైక్‌ల్లో ఐదు బైక్‌లనుజనాలు బాగా ఇష్టపడుతున్నారు. మరి ఆ ఐదు బైక్‌లో ఉంటే తెలుసుకుందాం..

ప్రస్తుత దేశీయ మార్కెట్లో రకరకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో కూలి పని చేసేవారి వద్ద కూడా బైక్ ఉంటుంది. సామాన్యులు ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లను ఇష్టపడుతుంటారు. అలాగే ధర కూడా తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అయితే గత నెలలో భారీగా అమ్ముడైన ఐదు బైక్‌ల గురించి తెలుసుకుందాం..
- హీరో స్ప్లెండర్: ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉన్నది బైక్ హీరో స్ప్లెండర్. హీరో మోటోకార్ప్ 2,07,763 యూనిట్లను విక్రయించింది. హీరో స్ప్లెండర్ ప్లస్ మైలేజ్-ఫ్రెండ్లీ బైక్. ఇది భారతదేశంలో రూ. 77,026 ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది. ఇది 4 వేరియంట్లు, 22 రంగులలో లభిస్తుంది.
- రెండవ స్థానంలో ఉన్న బైక్ హోండా షైన్. ఇది కూడా అద్భుతంగా ఉంది. రెండవ స్థానంలో హోండా షైన్.. 1,54,561 యూనిట్లను విక్రయించింది. హోండా షైన్ మైలేజ్ బైక్ 4 వేరియంట్లు, 7 రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర 83,251 నుండి ప్రారంభమవుతుంది.
- బజాజ్ పల్సర్ బజాజ్ పల్సర్ మూడవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఈ కారు 87,902 యూనిట్లు అమ్ముడయ్యాయి. బజాజ్ పల్సర్‌లో 9 కొత్త పల్సర్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ. 85,677 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్ బజాజ్ పల్సర్ 125, 124.4 సిసి ఇంజిన్‌తో 11.8 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే అత్యంత ఖరీదైన మోడల్ 199.5 సిసి ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200.
- హోండా CD డీలక్స్ CD: డీలక్స్ 70,581 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానంలో ఉంది. హోండా CD డీలక్స్ ఇప్పుడు హోండా CD 110 డ్రీమ్ డీలక్స్ అని పిలువబడుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర 76,401 నుండి ప్రారంభమవుతుంది.
- ఈ జాబితాలో టీవీఎస్ అపాచీ ఐదవ స్థానంలో ఉంది. గత నెలలో 37,954 మంది దీనిని కొనుగోలు చేశారు. TVS అపాచీ అనేది భారతదేశంలో TVS మోటార్స్ తయారు చేసే కమ్యూటర్ బైక్ బ్రాండ్. అపాచీ 5 మోడల్స్ రూ. 95,000 నుండి ప్రారంభమవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి