AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: టీ పొడితో కోట్ల రూపాయల వ్యాపారం.. మహారాష్ట్ర మహిళ సక్సెస్ మంత్రం

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచనా విధానం పూర్తిగా మారింది. గతంలో బాగా చదువుకుని మంచి ఉద్యోగంతో స్థిరపడదామనుకునే వారు. అయితే మారిన కాలంతో పాటు యువత ఆలోచనలు మారి వ్యాపారం రంగంలో స్థిరపడదామనుకునే వాళ్లు. ఉద్యోగమైతే ఎల్లప్పుడూ ఒకరి కింద పని చేయాలి. వ్యాపారమైతే మనకు మనమే బాస్‌లా ఉంటామని చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్లు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగంలో అడుగుపెడుతున్నారు.

Business Idea: టీ పొడితో కోట్ల రూపాయల వ్యాపారం.. మహారాష్ట్ర మహిళ సక్సెస్ మంత్రం
Pallavi Dhanraj Wale
Nikhil
|

Updated on: Mar 30, 2025 | 3:30 PM

Share

ఇటీవల కాలంలో వ్యాపారం చేయాలంటే చాలా పెట్టుబడితో కూడుకున్న పని. అందువల్ల ఏ పరిశ్రమలోకి ప్రవేశించాలన్నా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కానీ దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ నివాసి పల్లవి ధన్ రాజ్ వాలే ఈ తరహా ఆలోచనతో తనను తాను ప్రత్యేకంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె నాలుగు నుంచి ఐదు సంవత్సరాల క్రితం ఆరోగ్యకరమైన బెల్లం టీ పొడి ప్రీమిక్స్ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ఆమె ప్రతి నెలా సుమారు రూ.5 లక్షల విలువైన వ్యాపారాన్ని చేస్తుంది.

పల్లవి మొదట్లో ఒక బ్యాంకులో పనిచేసింది, కానీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అనుకున్నారు. తత్ఫలితంగా ఆమె తన ఉద్యోగాన్ని వదిలి ఇంటి నుంచే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ప్రతి ఇంట్లోనూ టీ కచ్చితంగా తాగుతారు కాబట్టి దానిని మరింత ఆరోగ్యకరంగా మార్చడం గురించి ఆమె ఆలోచించింది. దీంతో ఆరోగ్యకరమైన బెల్లం టీ పొడి ప్రీమిక్స్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత అభివృద్ధి చెందుతున్న జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి చక్కెరకు దూరంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పల్లవి ఐదు విభిన్న రుచులను అభివృద్ధి చేయడం ద్వారా తన టీపొడిని ప్రత్యేకంగా తయారు చేసింది. హెర్బల్ టీ, తులసి టీ, మసాలా టీ, ఇలాచి టీ, ఆయుర్వేద టీ కింద ప్రత్యేకంగా టీ పొడి మిక్స్‌లను తయారు చేసింది. 

అలాగే పల్లవి టీతోనే ఆగలేదు. బెల్లం బిస్కెట్లు, కరివేపాకు, గింజల పొడి, మునగ పొడి, చిక్‌పా బిస్కెట్లు, హార్డ్ బ్రెడ్, బీన్ చట్నీ, ఇన్‌స్టంట్ పురాన్ పోలి ప్రీమిక్స్ వంటి ఉత్పత్తుల శ్రేణుల్లో ఆమె తన ప్రతిభను చూపింది. దీంతో సేల్స్ అమాంతం పెరిగాయి. ఆమె ప్రస్తుతం ప్రతి నెలా 700 నుండి 800 కిలోల బెల్లం టీ పొడిని అమ్ముతుందని ఆమె సేల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో? అర్థం చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి