Numeros EV Scooter: మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్.. వారే అసలు టార్గెట్..!
భారతదేశంలో ఈవీ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకు సరికొత్త మోడల్స్ ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి మధ్యతరగతి ప్రజలే టార్గెట్ తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీ న్యూమోరోస్ మోటర్స్ లాంచ్ చేసిన కొత్త ఈవీ స్కూటర్ గురించి తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన న్యూమెరోస్ మోటార్స్ తన డిప్లోస్ మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మహారాష్ట్రలోని పూణేలో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను మొదట భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టారు. అనంతరం దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. న్యూమెరోస్ కంపెనీ నుంచి రిలీజైన మొదటి ఈవీ స్కూటర్ ధరను రూ. 1.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే)గా నిర్ణయించారు. న్యూమెరోస్ డిప్లోస్ మ్యాక్స్ 3.5 బీహెచ్‌పీ, 138 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే హబ్-మౌంటెడ్ పీఎంఎస్ 2.67 కేడబ్ల్యూ మోటర్ ద్వాారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 63 కి.మీ. వేగాన్ని అందుకుంది. ఈ స్కూటర్‌లో 1.85 కేడబ్ల్యూహెచ్ రెండు లిథియం- అయాన్ బ్యాటరీలతో ఆకట్టుకుంటుంది.
న్యూమోరోస్ డిప్లోస్ మాక్స్ ఈవీ స్కూటర్ ఎకో మోడ్లో 140 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్‌ను 1.2 కేడబ్ల్యూ ఛార్జర్ ఉపయోగించి నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే న్యూమెరోస్ డిప్లోస్ మ్యాక్స్ సరళమైన డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్‌లో రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, సిట్ సీట్లు, అండర్ సీట్ స్టోరేజ్‌తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. ఈ స్కూటర్‌లో జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్, థెఫ్ట్ అలారం వంటి అధునాతన పీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులతో పాటు వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ ద్వారా అన్ని రకాల రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆశ్వాదించవచ్చు. ముఖ్యంగా 150 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు మెరుగైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్స్‌తో వస్తుంది.
న్యూమోరోస్ డిప్లోస్ మ్యాక్స్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం న్యూమెరోస్ మోటార్స్ కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 14 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ కంపెనీ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 50 నగరాల్లో 100 కి పైగా డీలర్షిప్లను ప్రారంభించాలని యోచిస్తోంది. పూణేలో ప్రారంభించిన తర్వాత, ఈ సంవత్సరం మహారాష్ట్రలో మరో 20 డీలర్షిప్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి