Tesseract EV: అదిరే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. విక్రయాలు టాప్ గేర్‌లో దూసుకుపోతాయా..?
ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విభాగంలో విడుదలైన కార్లు, ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి స్కూటర్లు, బైక్ లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వివిధ రకాల కంపెనీలు అనేక మోడళ్ల స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగానే అల్ట్రావయోలెట్ కంపెనీ కొత్త ఫీచర్లతో టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మిగిలిన వాహనాల కంటే ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి గల ఐదు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో రాడార్ అసిస్టెడ్ వెనుక డాష్ క్యామ్ లను కలిగిన మొట్టమొదటి స్కూటర్ టెస్రాక్ట్. దీని ద్వారా రియల్ టైమ్ రైడ్ పుటేజ్ ను రికార్డు చేసుకోవచ్చు. అడ్వాన్స్ డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏఆర్ఏఎస్) కొలిషన్ అలారాలు, లేన్ చేంజ్ అసిస్టన్స్ అదనపు ప్రత్యేతకలు. రైడర్ భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. టెస్రాక్ట్ స్కూటర్ పనితీరు చాలా బాగుంటుంది. దీనిలో 20.1 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటారు ఏర్పాటు చేశారు. గంటకు గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ తో సింగిల్ చార్జిపై 260 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వేగవంతమైన చార్జర్ ను ఉపయోగించి గంటకు 80 శాతం బ్యాటరీని చార్జింగ్ చేయవచ్చు.
రైడర్ భద్రతకు ప్రాధాన్యం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాడార్, డాష్ క్యామ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. సురక్షితమైన రైడింగ్ కోసం డ్యూయల్ చానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. హ్యాండిల్ బార్ పై హాప్టిక్ ఫీడ్ బ్యాక్, బైండ్ స్పాట్ హెచ్చరిక కలిగిన స్మార్ట్ మిర్రర్ అదనపు ఆకర్షణగా ఉంది. స్కూటర్ లోని ఏడు అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ ద్వారా ఆన్ బోర్డు నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీకి అవకాశం ఉంటుంది. రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు హాప్టిక్ ఫీడ్ బ్యాక్ హ్యాండిల్ బార్లు, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, వైలెట్ ఏఐ ఇంటిగ్రేషన్ ఉపయోగపడతాయి.
సీటు కింద విశాలమైన ఖాళీ స్థలంలో హెల్మెట్ ను దాచుకోవచ్చు. డిజైన్ పరంగా ఈ స్కూటర్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన లైన్లు, ట్విన్ ఎల్ఈడీ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంపులు కొత్త అందాన్ని తీసుకువచ్చాయి. స్టెల్త్ బ్లాక్, సోనిక్ పింక్, డిసర్ట్ సాండ్ తదితర రంగులలో మార్కెట్ లో లభిస్తోంది. అలాగే కీలెస్ యాక్సెస్, పార్క్ అసిస్టెన్స్, హిల్ హూల్డ్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఆధునిక ఫంక్షన్లను ఏర్పాటు చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి