RIL AGM 2023: వారసులొచ్చిన వేళ రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గానే కొనసాగుతూ..
RIL AGM 2023: రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ సంస్థ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని, ఇది భారతదేశంలోని ఏ ఇతర కార్పొరేట్ కంపెనీ కన్నా ఎక్కువేనని తెలిపారు. రిలయన్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ. 9,74,864 కోట్లుగా ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రస్ట్, ట్యాక్సెస్, డిప్రిసియేషన్, అమార్టైజేషన్ రూ. 1,53,920 కోట్లు, నికర లాభం రూ. 73,670 కోట్లుగా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇంకా హెచ్ఆర్, నానినేషన్ అంట్ రెమ్యూనరేసన్ కమిటీ సిఫార్సుల మేరకు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీని నియమించాలని సోమవారం జరిగిన యాన్యూవల్ జనరల్ మీటింగ్ ఆమోదించింది. అలాగే ఆర్ఐఎల్ బోర్డ్ నుంచి నితా అంబానీ తప్పుకుని, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ మీటింగ్‌లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ సంస్థ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని, ఇది భారతదేశంలోని ఏ ఇతర కార్పొరేట్ కంపెనీ కన్నా ఎక్కువేనని తెలిపారు. రిలయన్స్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ. 9,74,864 కోట్లుగా ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రస్ట్, ట్యాక్సెస్, డిప్రిసియేషన్, అమార్టైజేషన్ రూ. 1,53,920 కోట్లు, నికర లాభం రూ. 73,670 కోట్లుగా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు.
ఇంకా హెచ్ఆర్, నానినేషన్ అంట్ రెమ్యూనరేసన్ కమిటీ సిఫార్సుల మేరకు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా నియమితులయ్యారని అన్నారు. ఇక షేర్ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాత వారు ఆయా బాధ్యతలు స్వీకరిస్తారని మీటింగ్ పేర్కొంది. మరోవైపు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మాత్రం బోర్డు నుంచి వైదొలిగారు. అయితే ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గానే కొనసాగుతూ, సంస్థను మరింత విస్తరించనున్నారు. సోమవారం జరిగిన ఈ మీటింగ్ ద్వారా ముఖేష్ అంబానీ తన వారసులకు కీలక బాధ్యతలు అందించే అవకాశాలు ఉన్నాయని బిజినెస్ విశ్లేషకులు భావించారు. ఇక ఇషా అంబానీని గతేడాది రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఇంకా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా నియమించారు.
ఇంకా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ గతేడాది జూలైలో నియమితులవగా.. చిన్న కుమారుడు అనంత్ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, జియో ప్లాట్‌ఫారమ్ బోర్డుల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..