Nita Ambani: శుభవార్త.. కొత్త హెల్త్ స్కీమ్ ప్రకటించిన నీతా అంబానీ.. మహిళలకు, పిల్లలకు ఉచిత చికిత్స!
సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా ముఖేష్ అంబానీ అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది పిల్లలు, మహిళలకు సహాయం చేయడానికి కొత్త ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రకటించారు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త. అతని భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా సామాజిక కార్యక్రమాల కోసం ముఖ్యమైన పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నీతా అంబానీ ద్వారా ఒక పెద్ద సామాజిక కార్యక్రమం చేపట్టారు. పిల్లలు, యువకులు, మహిళలకు ఉచిత పరీక్షలు, చికిత్స సౌకర్యాలు అందించనున్నారు. సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నీతా అంబానీ లక్ష మందికి పైగా మహిళలకు ఉచిత పరీక్షలు, చికిత్సను అందిస్తామని హామీ ఇచ్చారు.
సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త ఆరోగ్య సేవా పథకంలో భాగంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలకు ప్రత్యేక వైద్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో లక్ష మంది మహిళలకు అందించే ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా దీని కింద ఏ సేవలు అందించనున్నారో తెలుసుకుందాం.
నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, అధునాతన చికిత్సలతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఒక దశాబ్దాన్ని జరుపుకుంటామని, ఎందుకంటే భారతదేశానికి ఆరోగ్యకరమైన, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిని ప్రపంచ స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో మేము మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచామని అన్నారు.
ఇది కూడా చదవండి: Post Office Scheme: సూపర్ స్కీమ్.. నెలకు రూ.1500 డిపాజిట్ చేస్తే చాలు.. చేతికి రూ.31 లక్షలు!
• పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న 50,000 మంది పిల్లలకు ఉచిత పరీక్షలు, చికిత్స.
• 50,000 మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్, చికిత్స.
• 10,000 మంది యుక్తవయస్సులో ఉన్న బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా.
View this post on Instagram
ఇది కూడా చదవండి: Reliance Jio: జియో యూజర్లకు దీపావళి కానుక.. ఈ రెండు ప్లాన్లపై రూ.3350 వోచర్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి