School Holidays: విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!

దసరా సెలవుల్లో ఎంజాయ్‌ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు దీపావళి పండగ సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దీపావళి పండగకు వరుస సెలవులు రానున్నాయి. ఈ పండగను అక్టోబర్‌ 31న నిర్వహించనున్నారు..

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 28, 2024 | 9:36 PM

ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 31న, ధన్‌తేరస్ అక్టోబర్ 29న జరుపుకోనున్నారు. దీపావళి తరువాత ఛత్ పూజ పండుగ కూడా ఉంది. పిల్లలు సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి నుండి ఛత్ పూజ వరకు యుపి, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో సహా ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు ఎన్ని రోజులు మూసివేయబడతాయో తెలుసుకుందాం. అయితే దీపావళి పండగను కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు జరుపుకోనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకొంటారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీపావళి పండుగ సందడి మొదలైంది. పిల్లలు పెద్దలు టపాసులు కొంటూ.. మార్కెట్ అంతా సందడి చేస్తున్నారు. ఇక దీవాళి పండగ గురువారం రోజు వస్తుంది. గురువారంతోపాటు… శుక్రవారం కూడా స్కూళ్లకు రెండు రోజులు హాలిడేస్ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Ratan Tata: పెంపుడు కుక్కతో పాటు పని మనుషులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా!

ఇవి కూడా చదవండి

దీంతో దీపావళి సందర్భంగా ఏకంగా 4 రోజులు సెలవులు రానున్నాయి. అందులో ప్రభుత్వం 2 రోజులు సెలవులు అందిస్తుండగా.. ఒక రోజు రెండవ శనివారం… 1 రోజు ఆదివారం కలిసొచ్చింది. ఇప్పటికే మన పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు నాలుగు రోజుల సెలవులు ప్రకటించేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతే మిగిలుంది. ఇక్కడ కూడా ప్రకటిస్తే నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Airtel: ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతో తెలుసా?

ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు పాఠశాలలకు సెలవులకు సంబంధించి సర్క్యులర్ వచ్చినట్లు సమాచారం. అయితే దీపావళి తర్వాత సెలవులకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

పొరుగు రాష్ట్రాల్లో..

దీపావళి పండుగ ముగిసిన వెంటనే, ఛత్ యుపి, బీహార్, జార్ఖండ్‌లలో అతిపెద్ద పండుగ. ఛత్ పూజ 2024 నవంబర్ 7,8 తేదీలలో జరుపుకుంటారు. ఛత్ పూజ సందర్భంగా బీహార్ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. చాలా పాఠశాలల్లో దీపావళి నుండి ఛత్ పూజ వరకు నిరంతర సెలవులు ఉంటాయి.

మొత్తం నాలుగు రోజుల సెలవులు:

దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న పాఠశాలలు మూసి వేయనున్నారు. ఆపై నవంబర్ 2న గోవర్ధన్ పూజ, నవంబర్ 3న భాయ్ దూజ్ జరుపుకుంటారు. మధ్యలో ఒకరోజు ఆదివారం. మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 4 రోజులు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. కాగా బీహార్‌లో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ సంవత్సరం ఛత్ పూజ నవంబర్ 7, 8 తేదీలలో జరుపుకుంటారు. ఛత్ పూజ కోసం బీహార్‌లో నవంబర్ 6 నుండి నవంబర్ 9 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

నవంబర్‌ 7 వరకు స్కూల్స్‌ బంద్‌:

రాజస్థాన్‌లోని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి నవంబర్ 7 వరకు దీపావళి సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోనూ దీపావళి సందర్భంగా 4 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. దీపావళి అక్టోబర్ 31న, ప్రభుత్వ సెలవుదినం నవంబర్ 1న. ఆ తర్వాత శని, ఆదివారాల్లో ప్రభుత్వ సెలవులు ఉంటాయి.

దక్షిణాధి రాష్ట్రాల్లో..

దక్షిణాది రాష్ట్రాల్లోని పాఠశాలలు దీపావళి నాడు అక్టోబర్ 31న మూసి ఉంటాయి. అధికారిక ప్రకటనలో తమిళనాడు ప్రభుత్వం దీపావళి తర్వాత ఇంటికి తిరిగి వచ్చే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 1, 2024ని సెలవు దినంగా ప్రకటించింది. కర్ణాటకలో అక్టోబర్ 31న దీపావళి జరుపుకోనుండగా, నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవాన్ని జరుపుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి