Business Idea: పాత దుస్తులతో కాసుల వర్షం.. భారీ లాభాలు తెచ్చిపెట్టే సూపర్ బిజినెస్
ప్రస్తుతం బిజినెస్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొంగొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా యువత తాము సంపాదిస్తూ నలుగురికి ఉపాధి కల్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం...
ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్‌కు మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్లాస్టిక్, కాచు గ్లాసుల వంటి రీసైక్లింగ్ వ్యాపారాల గురించి ఇప్పటి వరకు మీరు విని ఉంటారు. అయితే వాడిపడేసిన దుస్తులను కూడా రీసైక్లింగ్ చేయొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ పాత దుస్తులతో రీసైక్లింగ్ ఎలా చేస్తారు.? అసలు రీసైక్లింగ్ చేసిన ఈ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న మొత్తం టెక్స్‌టైల్ వేస్ట్‌లో 8.5 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. దాదాపు ప్రతీ ఏటా 7800 కిలో టన్నుల టెక్స్‌టైల్ వేస్టేజ్ ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి దుస్తులను రీస్లైకింగ్ చేయడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ దుస్తుల రీసైక్లింగ్‌కు ఎలాంటి యంత్రాలు కావాలి.? దీంతో ఏం తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..
పాత దుస్తుల రీసైక్లింగ్ వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గోదాం కావాల్సి ఉంటుంది. పాత దుస్తుల రీసైక్లింగ్‌తో టైల్స్ తయారీ ఇప్పుడు ట్రండీ బిజినెస్‌గా చెప్పొచ్చు. ముందుగా పాత దుస్తులను తుక్కుగా మార్చే మిషిన్స్ అవసరపడతాయి. అలాగే టైల్స్ తయారీలో క్రష్‌డ్ గ్లాస్ కావాలి. ఇక పాత దుస్తులను కూడా హోల్‌సేల్ విక్రయించే సంస్థలు ఉన్నాయి. టైల్స్ తయారీలో పొటాష్ పౌండర్ వంటివి అవసరపడతాయి. ఇవన్నీ ఇండియా మార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికగా అందుబాటులో ఉన్నాయి.
క్లాత్ రీసైక్లింగ్ మిషిన్ ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. ఇది దుస్తులను ఫైబర్‌లాగా మార్చేస్తుంది. ఆ తర్వాత బ్లెండర్ మిషిన్ అవసరపడుతుంది. బ్లెండర్ మిషన్‌లో ఫైబర్‌త పాటు క్లషడ్ గ్లాస్, పొటాష్ పౌడర్‌ను వేసి మిక్స్ చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ. 75 వేలు ఉంటుంది. వీటితో పాటు టైల్స్ తయారీ మిషన్ కూడా అవసరపడుతుంది. ఈ మిషిన్ ధర రూ. లక్ష వరకు ఉంటుంది. బ్లెండర్ మిషన్ నుంచి వచ్చిన మెటీరియల్‌ను టైల్స్‌తయారీ మిషిన్‌లో వేస్తే టైల్ రడీ అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే సుమారు రూ. 8 లక్షల్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాల విషయానికొస్తే.. ఒక్క టైల్ తయారీకి సుమారు రూ. 11 ఖర్చవుతుంది. మార్కెట్లో ఒక్కో టైల్ ధర దాదాపు రూ. 70 వరకు ఉంటుంది. హోల్‌సేల్‌లో ఒక్కో టైల్‌ను రూ. 40కి విక్రయించినా రూ. 30 లాభం ఏటు పోదు. ఇలా చూసుకుంటే ఈ బిజినెస్‌తో భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..