Bank Loan: మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నా బ్యాంకు రుణం పొందవచ్చు.. ఎలాగో తెలుసా?

Bank Loan: ప్రస్తుతం క్రెడిట్ కార్డులు తీసుకోవడం, లోన్స్ తీసుకోవడం అందరికీ చాలా అవసరంగా మారిపోయింది. మనకు ఎంత సేవింగ్స్ ఉన్నా కానీ ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లోన్‌ తీసుకోవాలన్నా, క్రెడిట్‌ కార్డు తీసుకోవాలన్నా సిబిల్‌ స్కోర్‌ తప్పనిసరి అవసరం..

Bank Loan: మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నా బ్యాంకు రుణం పొందవచ్చు.. ఎలాగో తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Oct 27, 2024 | 6:10 PM

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. ఓ ఫారంలో పూర్తి వివరాలు బ్యాంకులో సబ్మిట్‌ చేస్తే పూర్తి ప్రాసెస్‌ అయిన తర్వాతే కార్డు అందేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. కేవలం ఫోన్‌ల ద్వారా వివరాలు అందించి కార్డును సులభంగా పొందే వెసులుబాటు వచ్చేసింది. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలన్నా , కొనాలన్నా, లేదా ఇతర ఆర్థిక అవసరాలకు బ్యాంకు లోన్‌ కోసం సంప్రదిస్తుంటాము. ఈ రోజుల్లో సులభంగా రుణాలు అందించే ఫైనాన్షియల్‌ సంస్థలు ఉన్నాయి. రుణం పొందాలంటే ముఖ్యంగా సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే. ఇది లేకుంటే ఏ బ్యాంకు కూడా మీకు లోన్‌ అందించదు. మరిత సిబిల్‌ తక్కువగా ఉన్నప్పటికీ లోన్‌ పొందే అవకాశం కూడా ఉంటుంది. మరి అదేలాగో చూద్దాం. సిబిల్ స్కోర్ అనేది రుణాల విషయంలో ప్రముఖ కీలక పాత్ర పోషిస్తుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా మెరుగ్గా ఉంటే లోన్ అనేది త్వరగా వస్తుంది. తక్కువగా ఉంటే మాత్రం మనకు ఎంత జీతం ఉన్నా కానీ లోన్ వచ్చే అవకాశం ఉండదనే చెప్పాలి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇక లోన్ అప్లై చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..

సిబిల్ స్కోర్ తక్కువున్నా కానీ రుణం పొందడానికి Co – Signer అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ తో మనం సిబిల్ స్కోర్ తక్కువున్నా కూడా లోన్ పొందవచ్చు. ఎలాగంటే మీ కుటుంబంలో కానీ లేదా మీకు తెలిసిన వారు కానీ లోన్లు తీసుకొని సకాలంలో కట్టిన వారు ఉంటారు. అందువల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. వాళ్ళ హామీతో మీరు బ్యాంకు రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మీ లోన్‌ పేపర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. మీ గురించి బ్యాంక్ వాళ్ళకు హామీ ఇస్తూ వారు సంతకం చేస్తే మీకు లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కానీ మీరు సకాలంలో లోన్ తీర్చకపోతే ఆ ప్రభావం వారిపై పడుతుందనే విషయం గుర్తించుకోండి. అందువల్ల వారికి నష్టం కలుగుతుంది. దీంతో తప్పకుండా రుణం సకాలంలో చెల్లించుకోవాలనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ లోన్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి: IRCTC: గుడ్‌న్యూస్‌.. మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే