Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..

ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ జాబితాలో మన భారతీయ రైల్వే ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైల్వేలో మనకు తెలియని ఎన్నో ఉంటాయి. వినడానికి వింతగా అనింపించినా అందులో టెక్నాలజీ దాగి ఉంది. రైల్వే ట్రాక్‌పై ఇసుక వేయడం వెనుక కారణం ఉంది..

Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..
Follow us

|

Updated on: Oct 27, 2024 | 5:36 PM

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అదిపెద్ద 4వ నెట్‌వర్క్‌. దేశంలో రవాణా వ్యవస్థలో ముందుంది. నిత్యం లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది రైల్వే. ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే డిపార్ట్ మెంట్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. టెక్నికల్ గా ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలించనప్పుడు రైలు సురక్షితంగా వెళ్లేందుకు పట్టాలపై ఇసుకను పోసేలా రైళ్లలో శాండ్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇలా ఇసుకను ఎందుకు పోస్టారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. పట్టాలపై ఇసుక పోయడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Big Change: నవంబర్ 1 నుంచి టెలికాం రంగంలో భారీ మార్పు.. ఇకపై మీకు నో టెన్షన్‌..!

ఇవి కూడా చదవండి

ఇసుక వేయడం అనేది రైలు చక్రాలు, రైలు మధ్య ఘర్షణను పెంచుతుంది. ఇది రైలు బ్రేకింగ్, ట్రాక్షన్‌ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రైలు అకస్మాత్తుగా రైలును ఆపడానికి ప్రయత్నించినప్పుడు లేదా తడి ట్రాక్‌లు లేదా వాలులు వంటి జారే ట్రాక్‌పై కదులుతున్నప్పుడు రైలు చక్రాలు, ట్రాక్‌ల మధ్య తగినంత ఘర్షణ లేకపోవడం వల్ల ఇసుకను వేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో ఇసుకను ఉపయోగించడం వల్ల రాపిడి పెరుగుతుంది. తద్వారా చక్రాలు జారిపోకుండా రైలు సురక్షితంగా ఆగిపోతుంది.

ఇది కూడా చదవండి: Jio Diwali Special Plan: జియో దీపావళి కానుక.. రూ.101కే అపరిమిత 5G డేటా!

ట్రాక్‌పై చక్రాలు పట్టు ఉండేలా లోతువైపు వెళ్లేటప్పుడు లేదా ఎక్కేటప్పుడు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రైలు చక్రాల దగ్గర ఇసుక నింపడం వల్ల చక్రాలు, ట్రాక్‌ల మధ్య రాపిడిని పెంచుతుంది. ఇది రైలు బ్రేకింగ్, ట్రాక్షన్‌ను మెరుగుపరుస్తుంది.

వర్షం కారణంగా పట్టాలు తడిగా ఉన్నప్పుడు రైలు నిర్ణీత వేగంతో ముందుకు కదిలేందుకు లోకోపైలట్ శాండ్ బాక్స్ లోని ఇసుక పట్టాలపై పడేందుకు స్విచ్ నొక్కుతాడు. ఇసుక పట్టాలపై పడగానే రైలు పట్టాలు, చక్రాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఫలితంగా, చక్రం జారడం తగ్గి, రైలు సులభంగా ముందుకు కదులుతుంది. ఏ వాతావరణంలోనైనా రైలు సరైన వేగంతో ముందుకు సాగుతుంది. ఇలా చేయకపోతే చక్రం ముందుకు కదలదు. దీంతో రైలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.ఇసుక సహాయంతో అటువంటి కొండ, ఏటవాలు ప్రదేశాలలో బ్రేకింగ్ చేయడం ద్వారా రైలును ఆపడం సులభం అవుతుందని రైల్వే నిపుణులు చెబుతున్నారు. ఈ ఇసుక బాక్స్‌ అన్ని రకాల రైళ్లలో అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: IRCTC: గుడ్‌న్యూస్‌.. మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి