- Telugu News Photo Gallery Business photos Jio offers unlimited 5g data with rs 101 recharge plan on diwali 2024
Jio Diwali Special Plan: జియో దీపావళి కానుక.. రూ.101కే అపరిమిత 5G డేటా!
Jio Diwali Special Plan: రిలయన్స్ జియో తన కస్టమర్లకు దీపావళి కానుగా బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. తక్కువ ధరల్లో ఎక్కువ డేటా అందించే ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. రోజులో ఎక్కువగా డేటా వినియోగించే వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది..
Updated on: Oct 27, 2024 | 4:56 PM

చౌక ప్లాన్‌లో చాలా డేటా: రూ. 999 ప్లాన్ 5G ప్లాన్. మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉంటే, మీరు అపరిమిత ఉచిత డేటాను ఉపయోగించవచ్చు. ఇందులో లభించే డేటా ప్రయోజనాల గురించి మాట్లాడితే, మీరు ఇందులో మొత్తం 196GB డేటాను పొందుతారు. అంటే మీరు ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటాను ఉపయోగించవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు ప్లాన్‌లో 64kbps వేగం పొందుతారు.


ప్రతిరోజూ 1 నుంచి 1.5 జీబీ డేటాను ఉపయోగించడం చాలా సులభం అయిపోయింది. అంతకంటే ఎక్కువ ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. రూ. 101 ప్లాన్‌ని ఎంచుకోవడం ద్వారా అదనపు డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

మీరు రిలయన్స్ జియో సిమ్ ఉపయోగిస్తుంటే మీకో శుభవార్త ఉంది. జియో జూలై నెలలో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఖరీదైన ప్లాన్‌ల కారణంగా లక్షలాది మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLకి మారారు. ఇప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, Jio దీర్ఘ కాల వ్యాలిడిటీతో గొప్ప ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

జియో తన 49 కోట్ల మంది కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. లాంగ్ వాలిడిటీని అందించే చౌక ప్లాన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. Jio ఇటీవల తన జాబితాకు రూ. 999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ని జోడించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో, మీరు 98 రోజుల సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. అంటే మీరు ఇకపై ఒక రీఛార్జ్ ప్లాన్‌తో 100 రోజుల పాటు రీఛార్జ్ చేసుకోవడం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు 98 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.





























