IRCTC: గుడ్‌న్యూస్‌.. మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్‌!

చాలా మంది పండలకు తమతమ సొంతూళ్లకు వెళ్లుంటారు. ఇలాంటి సమయంలో చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ముందస్తుగానే టికెట్స్‌ బుక్‌ చేసుకుంటారు. కానీ సాధారణ సమయాలలో కంటే పండగల సమయాల్లో టికెట్స్‌ కన్ఫర్మ్‌ కావడం కొంత కష్టమే. అలాంటి సమయంలో టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయ్యేలా రైల్వే శాఖ కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

IRCTC: గుడ్‌న్యూస్‌.. మీ రైలు టికెట్‌ కన్ఫర్మ్‌ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్‌!
Follow us

|

Updated on: Oct 27, 2024 | 2:39 PM

దీపావళి, ఛత్ వంటి పెద్ద పండుగలలో రైలు ప్రయాణం అంటే పెద్ద సవాలే. ఎందుకంటే టికెట్స్‌ దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పండగలకు ముందస్తుగానే బుక్‌ చేసుకుంటే తప్ప టికెట్‌లు కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. మీరు కూడా ఈ దీపావళి లేదా ఛత్ ఇంటికి వెళ్లాలని భావిస్తే, కన్ఫర్మ్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. ప్రయాణీకులకు ఉపశమనం కలిగించడానికి కన్ఫర్మ్‌ టికెట్స్‌ పొందడానికి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే (IRCTC) ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. దీనికి వికల్ప్ స్కీమ్ అని పేరు పెట్టారు. రైలు టికెట్‌ బుక్‌ చేసుకుని వెయిట్‌లిస్ట్‌లో ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం టికెట్స్‌ కన్ఫర్మ్ అయ్యేలా ఈ పథకం ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Post Office: ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే ఐదేళ్లలో రూ.12 లక్షల వడ్డీ..!

వికల్ప్ పథకం అంటే ఏమిటి?

వికల్ప్ స్కీమ్ అనేది IRCTC తీసుకువచ్చింది. ఇది వారు ప్రయాణించే రైలులో కన్ఫర్మ్‌ అయ్యే సీటును పొందలేని ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ రైళ్ల ఆప్షన్‌ను అందించడానికి రూపొందించారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులను అదే మార్గంలో అందుబాటులో ఉన్న సీట్లతో ప్రత్యామ్నాయ రైళ్లకు బదిలీ చేయడానికి ఈ పథకం సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ ఆప్షన్‌ మీ సీటును కన్ఫర్మ్‌ చేయదు. కానీ కన్ఫర్మ్ సీటు పొందే అవకాశాలను మాత్రమే పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: TV Tariff Plan: టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్‌.. పెరగనున్న ధరలు.. ప్రభుత్వం కొత్త నిబంధనలు!

వికల్ప్ పథకం ఎలా పని చేస్తుంది?

ఒక ప్రయాణికుడు వికల్ప్ స్కీమ్‌ను ఎంచుకున్నప్పుడు అతని వెయిట్‌లిస్ట్ టిక్కెట్టు సీట్లు అందుబాటులో ఉన్న మరొక రైలుకు మారుస్తుంది. అంటే అదే మార్గంలో నడిచే మరో రైలులో టికెట్లు కర్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయన్నట్లు. దీపావళి, ఛత్ వంటి అత్యంత రద్దీగా ఉండే పండుగల సమయంలో ప్రజలు చివరి నిమిషంలో టిక్కెట్ కన్ఫర్మ్‌ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ రైలులో సీట్లు అందుబాటులో ఉంటే అందులో ప్రయాణికుల టిక్కెట్ ఆటోమేటిక్‌గా కన్ఫర్మ్‌ అవుతాయి. అయితే, టికెట్ కన్ఫర్మ్ అయి, తర్వాత క్యాన్సిల్ అయినట్లయితే క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.

వికల్ప్ పథకాన్ని ఎలా ఉపయోగించాలి?

IRCTC రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు వికల్ప్ స్కీమ్‌ను ఎంచుకోవడానికి దశల వారీ ప్రక్రియ ఉంటుంది.:

1. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించి లాగిన్ చేయండి.

2. మీ ప్రయాణ తేదీ, గమ్యం, కేటగిరిని ఎంచుకోండి.

3. మీ బుకింగ్‌ని నిర్ధారించడానికి ప్రయాణికుల వివరాలను నమోదు చేసి చెల్లింపు చేయండి.

4. ప్రాంప్ట్ చేసినప్పుడు ఎంపిక పథకం ఆప్షన్‌ను ఎంచుకోండి.

5. ప్రత్యామ్నాయ రైళ్ల జాబితా ఇక్కడ కనిపిస్తుంది. మీకు అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ రైలును ఎంచుకోండి.

6. చార్ట్ సిద్ధమైన తర్వాత ప్రత్యామ్నాయ రైలులో మీ బుకింగ్ కన్ఫర్మ్‌ అయ్యిందో లేదో చూడటానికి మీ PNR ద్వారా చెక్‌ చేసుకోండి.

వికల్ప్ పథకం ప్రత్యేక లక్షణాలు:

1. ఇది మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2. వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికులకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తిస్తుంది.

3. ఈ స్కీమ్‌లో చేరడానికి ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

4. ఆప్షన్‌ను ఎంచుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్ల కోసం స్వయంచాలకంగా పరిగణిస్తారు.

5. ఒకసారి ప్రత్యామ్నాయ రైలుకు మారిన తర్వాత, ప్రయాణికులు ముందుగా వెళ్లాలనుకున్న రైలులో ఎక్కలేరని గుర్తించుకోండి.

6. ఈ సదుపాయం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టికెట్లకు కన్ఫర్మ్‌ అయ్యేలా ఉపాయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Dhanteras 2024: మీరు బంగారం కొంటున్నారా? పాన్‌, ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సిందే.. ఈ నిబంధన ఎందుకు?