Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా.? ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది

బిజినెస్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారా.? వినూత్నంగా, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే ఒక బెస్ట్ బిజినెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ముత్యాలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటోంది. ఇంతకీ ముత్యాల తయారీని ఎలా ప్రారంభించాలి.? ఎంత పెట్టుబడి కావాల్సి ఉంటుంది. లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా.? ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది
Business
Follow us

|

Updated on: Oct 27, 2024 | 12:33 PM

ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉద్యోగం కంటే వ్యాపారానికే పెద్ద పీట వేస్తున్నారు. తాము నాలుగు రూపాయలు సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నష్టాలు లేని, పెట్టుబడి తక్కువగా ఉండే వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం ముత్యాల సాగుకు మంచి డిమాండ్‌ ఉంది. మార్కెట్లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ముత్యాల తయారీ ఉండడం లేదు. అందుకే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వార కళ్లు చెదిరే లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ముత్యాలను ఎలా తయారు చేస్తారు.? ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముత్యాలను సాగుకు అక్టోబర్‌ డిసెంబర్‌ సరైన సమయంగా చెబుతుంటారు. ఈ సాగును ప్రారంభించాలంటే 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీటి కొలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆయిస్టలరను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఆయిస్టర్‌ నుంచి ఒక ముత్యతం లభిస్తుంది. ఆయిస్టర్ల ధర విషయానికొస్తే రూ. 15 నుంచి రూ. 25 వరు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక వంద ఆయిస్టర్లతో వ్యాపారం ప్రారంభించారనుకుంటే రూ. 20 వేల పెట్టుబడి అవసరపడుతుంది.

ఆయిస్టర్‌ నుంచి ముత్తం తయారవ్వడానికి 15 నుంచి 20 నెలలు పడుతుంది. మార్కెట్లో ఒక్కో ముత్యం ధర నాణ్యత బట్టి రూ. 300 నుంచి రూ. 1500 వరకు ఉంటుంది. ఇక మరింత నాణ్యమైన ముత్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ. 10 వేల వరకు కూడా ఉన్నాయి. సరాసరి ఒక్కో ముత్యం రూ. 1000 చొప్పున అమ్ముడుపోయినా రూ. లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చు. ముత్యాల సాగుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ శిక్షణ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!