AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV Tariff Plan: టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్‌.. పెరగనున్న ధరలు.. ప్రభుత్వం కొత్త నిబంధనలు!

ఇటీవల మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు టీవీ ఛానళ్ల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టీవీ ఛానళ్లు చూసే వినియోగదారులకు మరింత భారం పడనుంది.

TV Tariff Plan: టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్‌.. పెరగనున్న ధరలు.. ప్రభుత్వం కొత్త నిబంధనలు!
Subhash Goud
|

Updated on: Oct 26, 2024 | 9:07 PM

Share

ఈ సంవత్సరం జూలైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. ఆ తర్వాత జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది తమ నంబర్లను పోర్టు పెట్టుకున్నారు. ఇక మొబైల్‌ టారీఫ్‌ల వంతైపోయింది. ఇప్పుడు టీవీ ఛానళ్ల వంతు వచ్చేసింది. వీటి ధరలు కూడా మరింత ఖరీదైనవి కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేబుల్ టీవీ ఆపరేటర్ టారిఫ్, జీఎస్టీని పెంచుతున్నట్లు ప్రకటించింది. కేబుల్ టీవీలపై 18కి బదులు 5 శాతం జీఎస్టీ విధించాలని డిమాండ్ చేశారు.

అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యతిరేకత మొదలైంది. ఛానల్ టారిఫ్ పెంపు, 18% జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనపై వ్యతిరేకత మొదలైంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కేబుల్ టీవీ ఛానెళ్ల సుంకాన్ని పెంచింది. అలాగే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే జీఎస్టీ రేటు 18 శాతానికి బదులు 5 శాతం ఉండాలని కేబుల్ టీవీ ఆపరేటర్లు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు

చెన్నై కేబుల్ టీవీ ఆపరేటర్లు ప్రభుత్వ ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఏఎంఎంకే వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 18 శాతం జీఎస్టీ విధించే నిబంధనను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

నెలవారీ ఖర్చు ఎంత పెరుగుతుందో తెలుసుకోండి

జీఎస్టీ పెంపు నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపనుంది. అంటే, కేబుల్ టీవీ ఆపరేటర్లపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధిస్తే, పెరిగిన ధరను ఆపరేటర్ కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో మీ నెలవారీ రీఛార్జ్ రూ. 500 అయితే, మీరు రూ. 90 అదనంగా చెల్లించాలి. అదే రూ. 1000 రీఛార్జ్‌పై, మీరు రూ. 180 అదనంగా చెల్లించాలి. అదేవిధంగా రూ.1500 రీఛార్జ్‌పై రూ.270 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కేబుల్ టీవీ చూసే వినియోగదారుల మీ నెలవారీ ఖర్చు పెరుగుతుంది. భారతదేశంలో అనేక వినోద విధానాలు ఉన్నాయి. వినియోగదారులు ఇంటర్నెట్ సహాయంతో OTT యాప్‌ల నుండి నేరుగా సినిమాలు, షోలను చూస్తున్నారు. కొంతమంది టాటా స్కై, డిష్ టీవీ వంటి వైర్‌లెస్ మోడ్‌లను ఉపయోగిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు వైర్‌లైన్ సహాయంతో టీవీ, షోలను చూస్తున్నారు. దీనిని కేబుల్ టీవీ అని పిలుస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి