Aadhaar Update: ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త అప్‌డేట్.. కేంద్రం కీలక నిర్ణయం!
Aadhaar Update: ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం నుండి బ్యాంక్ ఖాతా తెరవడం వరకు, ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అనేక ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు..
భారతదేశం అంతటా ప్రజలకు ఆధార్ కార్డ్ సంబంధిత సేవలను అందించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 13,352 ఆధార్ నమోదు, అప్‌డేట్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడంలో ప్రజలు నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నందున సమస్య నుండి బయటపడేందుకు పోస్టాఫీసులలో కూడా ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చని ఇండియా పోస్ట్ తన ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేసింది.
ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు ప్రజలు పెద్ద క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ శాఖ కూడా ఆధార్ సంబంధిత సేవలను అందించడం ప్రారంభించిందని తపాలా శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: IRCTC: గుడ్‌న్యూస్.. మీ రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలాంటే ఇలా చేయండి.. రైల్వే కొత్త స్కీమ్!
నోటిఫికేషన్ ప్రకారం.. పోస్టాఫీసులలో రెండు రకాల ఆధార్ నమోదు, అప్‌డేట్ సేవలను అందుబాటులో ఉంటాయి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌లో వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా నమోదు చేయడం ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. ఆధార్ అప్‌డేట్‌లో ఎవరైనా తమ పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, ఫోటో, ఐరిస్ ఏదైనా పొరపాటు లేదా గడువు ముగిసినట్లయితే అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈ సేవ భారతదేశంలోని 13,352 కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఈ సేవ కోసం ఏ తపాలా కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి https://www.indiapost.gov.in/లో ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.
గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలతో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌ను అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సిఫార్సు చేస్తోంది. ఆధార్ సంబంధిత స్కామ్‌లను నివారించడానికి గత 10 సంవత్సరాలుగా తమ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆధార్ హోల్డర్‌లను కోరుతోంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి