Komaki CAT 3.0 NXT: డెలివరీ బాయ్స్ కష్టాలు ఆ ఈవీతో దూరం.. నయా త్రీవీలర్ ఈవీ లాంచ్ చేసిన కొమాకీ
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే వ్యక్తిగత అవసరాలకు ఈవీలు అందుబాటులో ఉన్నా రవాణా వాహనాల విషయంలో మాత్రం ఈవీలు అందుబాటులో ఉండడం లేదు. అయితే ఇటీవల కాలంలో డెలివరీ సేవలకు అనువుగా ఉండేలా ఓ కొత్త ఈవీ బైక్‌ను కొమాకీ అనే సంస్థ విడుదల చేసింది. ఆ ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కొమాకీ ఎలక్ట్రిక్ నాయ క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ డెలివరీ బైక్‌ను ఇటీవల విడుదల చేసింది. చిన్న, మధ్య తరహా వ్యాపారుల డెలివరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పరిచయం చేశారు. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. గ్రాఫేన్, ఎల్ఐపీఓ4 వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈవీ త్రీవీలర్స్ ధరలు రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. గ్రాఫేన్ 180 కిమీ పరిధిని అందిస్తుండగా, ఎల్ఐపీఓ 4 మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీ కంటే ఎక్కువ ప్రయాణిస్తుందని కొమాకీ ప్రతినిధులు చెబుతున్నారు. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ అనేది యాప్ ఆధారిత బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనమని పేర్కొంటున్నారు.
కొమాకీ ఈ-ఫ్లీట్ మెటల్ బాడీ తయారు చేశారు. అలాగే ఈ త్రీవీలర్ కన్వర్టిబుల్ సీట్లతో వస్తుంది. ఈ ఈవీ వాహనం గరిష్టంగా 500 కిలోల సామర్థ్యంతో కూర్చోవడానికి, లోడ్ మోయడానికి తగినంత స్థలంతో వస్తుంది. క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ కన్వర్టిబుల్ స్వభావం మల్టీ లోడ్ కాన్ఫిగరేషన్లను తీసుకువెళ్లడానికి అనుమతిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లో అనేక ఫీచర్లు ఉన్నాయని కొమాకీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ త్రీ వీలర్‌లో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఇంక్లైన్ బ్రేక్ లాకింగ్, మూడు చక్రాలపై డిస్క్ బ్రేక్లు, స్పష్టమైన విండ్ షీల్డ్ ఉన్నాయి.
క్యాట్ 3.0 ఎన్ఎక్స్‌టీ మూడు గేర్ మోడ్లతో వస్తుంది. ఎకో, స్పోర్ట్, టర్బో మోడ్‌లతో వచ్చే ఈ ఈవీ త్రీ వీలర్ డెలివరీ బాయ్స్‌ను ఆకట్టుకుంటుందని కొమాకీ ఎలక్ట్రిక్ డివిజన్ సహ వ్యవస్థాపకుడు గుంజన్ మల్హోత్రా చెబుతున్నారు. దేశంలోని ప్రతి మూలలో తమ వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడం కోసం ఈ ఈవీ త్రీ వీలర్‌ను లాంచ్ చేశామని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి