Redmi 14C: కొత్త ఏడాది రెడ్‌మీ నయా ఫోన్ లాంచ్..? వారే అసలు టార్గెట్..!

ప్రస్తుతం 2024 సంవత్సరంలో చివర్లో ఉన్నాం. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త ఏడాది తమ కొత్త ఉత్పత్తులు లాంచ్ చేస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ కొత్త ఏడాది తన సరికొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. రెడ్‌మీ 14 సీ పేరుతో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Redmi 14C: కొత్త ఏడాది రెడ్‌మీ నయా ఫోన్ లాంచ్..? వారే అసలు టార్గెట్..!
Redmi 14c
Follow us
Srinu

|

Updated on: Dec 31, 2024 | 10:23 AM

ఎంఐ తన  తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 14సీ నూతన ఏడాదిలో లాంచ్ చేయనుంది. ముఖ్యంగా బడ్జెట్ ప్రియులను టార్గెట్ చేసేలా ఈ ఫోన్ లాంచ్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్‌ను రెడ్ మీ 13 సీ ఫోన్‌కు సక్సెసర్‌గా ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వివిధ కంపెనీలు వివో ఎక్స్ 200 ప్రో, అప్పో ఫైండ్ ఎక్స్‌8 ప్రో, రియల్ మీ జీటీ 7 ప్రో వన్ ప్లస్ 13 ఫోన్‌లతో పాటు ఐక్యూ 13 ఫోన్ కూడా ఈ నెలలోనే లాంచ్ చేశారు. అయితే రెడ్ మీ మాత్రం తన నూతన ఫోన్‌ను 2025 జనవరిలోనే లాంచ్ చేయనుంది. 

రెడ్‌మి 14సీ రెడ్‌మి ఏ4 మాదిరిగానే డిజైన్‌‌తో వస్తుందని లీక్‌డ్ ఫొటోలు చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ లుక్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీ 14 సీ ప్రీమియం డిజైన్ మధ్య తరగతి ప్రజలను ద‌ృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారని పేర్కొంటున్నారు. ఈ మల్టీ సెన్సార్‌లతో సహా వెనుకవైపు సర్కిల్ కెమెరా మాడ్యూల్‌‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీ 14 సీ ఫోన్ న్యూ బ్లూ కలర్‌లో ఆకట్టుకుంటుంది. నయా రెడ్ మీ 14 సీ ఇటీవల లాంచ్ అయిన రెడ్‌మీ 14 ఆర్ రీబ్రాండెడ్ వెర్షన్‌లో ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

రెడ్‌మీ 14 సీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ద్వారా పని చేస్తుంది. అలాగే 18 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీను ఇవ్వడం ద్వారా మధ్య తరగతి ప్రజలు ఈ ఫోన్‌ను ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆ ఫోన్ 6.68 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో లాంచ్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.15 వేల లోపు ఉంటుందని వివరిస్తున్నారు. 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!