Part Time Job Scam: ఉద్యోగం పేరుతో కేటుగాళ్ల నయా స్కెచ్.. రూ.57 లక్షలు హాంఫట్..!

పెరిగిన టెక్నాలజీను ఉపయోగించుకుని మోసాలు చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతున్నారు. గతంలో ఎలాంటి చదువు లేని నిరక్షరాస్యులను టార్గెట్ చేసి డబ్బు కొట్టేసే కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. బాగా చదువుకున్న వారి అవసరాలను లక్ష్యంగా మోసాలు చేస్తున్నారు.

Part Time Job Scam: ఉద్యోగం పేరుతో కేటుగాళ్ల నయా స్కెచ్.. రూ.57 లక్షలు హాంఫట్..!
Follow us
Srinu

|

Updated on: Dec 31, 2024 | 10:45 AM

ఎలక్ట్రికల్ పోల్స్ పరిశ్రమకు చెందిన 27 ఏళ్ల యువకుడిని పార్ట్ టైమ్ జాబ్ పేరుతో కేటుగాళ్లు రూ.57.75 లక్షల మేర మోసం చేశారు. పని తక్కువ రాబడి ఎక్కువ పేరుతో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పడంతో బాధితుడు పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేశఆడు అయితే ఈ కేసులో ప్రమేయం ఉన్నందుకు ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 14 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 16న బాధితుడికి అనసూయ అనే మహిళ నుంచి టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ వచ్చింది. ప్రతి రోజూ కేవలం మూడు గంటలు ఆన్‌లైన్ ద్వారా పని చేస్తే  రోజుకు రూ. 4,650 సంపాదించవచ్చని ఆ మెసేజ్‌లో ఉంది. అలాగే ఓ రెండు రోజుల తర్వాత అభినయ అనే మరో మహిళ, ‘మ్యాంగో ఫ్యాషన్’ అనే కంపెనీతో తనకు సంబంధం ఉందని పేర్కొంటూ అతన్ని సంప్రదించింది. 

ఈ కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించింది. నమోదు చేసుకున్న అనంతరం అక్కడ అతని డిజిటల్ వాలెట్‌కు రూ. 10,000 బోనస్ జమ అయ్యింది. బాధితుడు వేగంగా టాస్క్‌లను పూర్తి చేయడం కొనసాగించడంతో అతని వాలెట్ బ్యాలెన్స్ పెరిగింది. దీంతో ఆ ప్లాట్ ఫారమ్ నమ్మకమైందని అనుకున్నాడు. భారీ వ్యాలెట్ బ్యాలెన్స్‌తో ఉన్న బాధితుడి ఫ్రేమ్‌లోకి మళ్ల అభినయ వచ్చింది. మ్యాంగో ఫ్యాషన్‌లో పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పింది. అలాగే దఫదఫాలుగా బాధితుడు స్కామర్లు అందించిన 11 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.58.06 లక్షలను బదిలీ చేశాడు. అతని డిజిటల్ వాలెట్ లాభాలతో సహా రూ. 76 లక్షలు చూపించింది. కానీ అతను నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను రెండు చిన్న లావాదేవీలలో రూ. 30,858 మాత్రమే తిరిగి పొందాడు. 

పెద్ద మొత్తాలను ఉపసంహరించుకోవడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అతను మోసపోయానని గ్రహించాడు. ఆగస్ట్ 29న, అతను సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు విచారణ తర్వాత బాధితుడిని మోసం చేసిన 14 మందిపై డిసెంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు అనేది చదువుకున్న వ్యక్తులు ఈజీ ఎలా మోసపోతున్నారో? తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జాబ్ ఆఫర్ పేరుతో పెట్టుబడుల మార్గం వైపు తీసుకెళ్లే ఏ కంపెనీను నమ్మవద్దని చెబుతున్నారు. ఒకవేళ నమ్మాల్సి వస్తే కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ధ్రువీకరించుకోవాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిజంగా ఉద్యోగాలు ఇచ్చే ఎలాంటి కంపెనీలు డబ్బు అడగవని, ఇలాంటి మోసాలకు గురైతే కచ్చితంగా ఎలాంటి భయం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్