AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం.. టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?

కొత్త ఆర్థిక సంవత్సరం, ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలుతో జీతభత్యాలు పొందే ఉద్యోగుల జీత నిర్మాణంలో కీలక మార్పులు రానున్నాయి. పన్ను రేట్లు పెరగకపోయినా, పన్ను రహితంగా ఉన్న అలవెన్సులు, కంపెనీ ప్రయోజనాలు పన్ను పరిధిలోకి వస్తాయి. దీంతో పన్ను విధించదగిన ఆదాయం పెరిగి, టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం.. టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
Salary
SN Pasha
|

Updated on: Mar 28, 2026 | 3:51 PM

Share

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 2025 అమలులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగుల్లో ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు పన్ను రేట్లను పెంచకపోయినా, జీత నిర్మాణాన్ని ప్రభావితం చేసే విధంగా కీలక మార్పులను తీసుకువస్తున్నాయి. ఈ మార్పుల అమలు బాధ్యతను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించనుంది. నిపుణుల ప్రకారం.. ఉద్యోగుల మొత్తం కాస్ట్ టు కంపెనీ (CTC) యథాతథంగా ఉన్నప్పటికీ, జీతంలోని భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇప్పటివరకు పన్ను రహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు, ఇతర ప్రయోజనాలను కొత్త నిబంధనల ప్రకారం స్పష్టంగా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో ఉద్యోగుల పన్ను విధించదగిన ఆదాయం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే సమయంలో గతంలో అమలులోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపించనుంది. ఈ చట్టాల ప్రకారం ఉద్యోగి బేసిక్ జీతం మొత్తం CTCలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంగా ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ జీతం కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతోంది. కంపెనీ వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వాహనం, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించబడతాయి. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.

ఇక పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంపిక విషయంలో కూడా ఉద్యోగులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాత విధానంలో సెక్షన్‌ 80C వంటి మినహాయింపులు అందుబాటులో ఉండగా, కొత్త విధానం తక్కువ పన్ను రేట్లను అందించినప్పటికీ, మినహాయింపులు పరిమితంగా ఉంటాయి. మొత్తంగా ఈ మార్పులు ఉద్యోగుల జీత నిర్మాణాన్ని మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంగా భావిస్తున్నప్పటికీ, తక్షణ ప్రభావం వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. అందువల్ల ఉద్యోగులు తమ జీత వివరాలను సమీక్షించి, సరైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవడం అవసరంగా మారింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఏప్రిల్ 1 నుంచి టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
ఏప్రిల్ 1 నుంచి టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
తులసితో కలిసి భాను ఎంత పని చేసింది.. ప్రియుడు దక్కడనుకుని..
తులసితో కలిసి భాను ఎంత పని చేసింది.. ప్రియుడు దక్కడనుకుని..
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారా?.. అసలు నిజం తెలిస్తే షాకే
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారా?.. అసలు నిజం తెలిస్తే షాకే
లీటర్ డీజిల్‌కు రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది..?
లీటర్ డీజిల్‌కు రైలు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది..?
ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో వెనుకబడటం ఖాయం!
ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో వెనుకబడటం ఖాయం!
2026లో బెస్ట్ బడ్జెట్ విండో ఏసీలు..అదిరిపోయే ఫీచర్లు, అందుబాటు ధర
2026లో బెస్ట్ బడ్జెట్ విండో ఏసీలు..అదిరిపోయే ఫీచర్లు, అందుబాటు ధర
పాము కంటే డేంజర్.. ఈ పురుగు కనిపిస్తే వెంటనే పారిపోండి!
పాము కంటే డేంజర్.. ఈ పురుగు కనిపిస్తే వెంటనే పారిపోండి!
భారీ గ్రహాల మార్పు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా .. మీరున్నారా?
భారీ గ్రహాల మార్పు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా .. మీరున్నారా?
టైటిల్ చూసి చీ కొట్టిన జనాలు.. అయినా 10 ఏళ్లుగా ట్రెండింగ్..
టైటిల్ చూసి చీ కొట్టిన జనాలు.. అయినా 10 ఏళ్లుగా ట్రెండింగ్..
మీరు ఎప్పుడూ రుచి చూడని వెజ్ బ్రెడ్ ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోద్ది
మీరు ఎప్పుడూ రుచి చూడని వెజ్ బ్రెడ్ ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోద్ది