AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీల్ మేకర్ ఆమ్లెట్ ఇలా చేస్తే పక్కింటి వాళ్లు అసూయపడాల్సిందే

Meal Maker Omelette Recipe: మీల్ మేకర్ ఆమ్లెట్ వినడానికి కొత్తగా ఉంటుంది. కానీ, చేసుకుని తింటే రుచిగా ఉంటుంది. దీనిని కొన్ని చోట్లా ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 28, 2026 | 3:06 PM

Share
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మీల్ మేకర్, నాలుగు గుడ్లు, ఒక ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
మీల్ మేకర్ ఇలా సిద్ధం చేసుకోవాలి : వేడి నీటిలో మీల్ మేకర్స్ తీసుకుని వాటిని  5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టండి. నీటిని వంపేసి వాటిని మిక్సీలో కానీ రోటిలో కానీ బరకగా పెట్టుకోవాలి.

2 / 5
గుడ్ల మిశ్రమం కలుపుకోవాలి: ఒక గిన్నె తీసుకుని గుడ్లను కొట్టి, వాటిలో మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ పొడి, ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి  సరిపడా ఉప్పు,  కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి.

3 / 5
ఆమ్లెట్ ఇలా వేసుకోవాలి: స్టవ్  మీద పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెనంపై పోసి కొంచం మందంగా వేసుకోవాలి. ఇలా ఒక వైపు ఎర్రగా కాలిన తర్వాత, రెండో వైపు కూడా అట్టును బాగా కాల్చుకోవాలి.

4 / 5
ఆమ్లెట్ ను ఇలా కాల్చుకోవాలి: అయితే, అట్టు మగ్గేటప్పుడు సిమ్ లోనే పెట్టాలి. ఇలా పెడితే ఆమ్లెట్ బాగా ఉడుకుతుంది. 
ఆ తర్వాత మూత పెట్టి పది నిముషాల పాటు ఉడికించండి. ఆమ్లెట్ తిరగేసి, గోల్డ్ రంగు వచ్చే వరకు ఉంచి ప్లేట్  లోకి తీసుకోవాలి.

ఆమ్లెట్ ను ఇలా కాల్చుకోవాలి: అయితే, అట్టు మగ్గేటప్పుడు సిమ్ లోనే పెట్టాలి. ఇలా పెడితే ఆమ్లెట్ బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత మూత పెట్టి పది నిముషాల పాటు ఉడికించండి. ఆమ్లెట్ తిరగేసి, గోల్డ్ రంగు వచ్చే వరకు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి.

5 / 5
Follow Us