AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veg Omelet Recipe: గుడ్డు లేకుండానే వెజ్ ఆమ్లెట్.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్..

చాలామందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే మహా ఇష్టం. కానీ గుడ్డు తినని వారు ఆ రుచిని మిస్ అవుతుంటారు. అయితే, శనగపిండి బియ్యపు పిండిని సరైన మోతాదులో కలిపితే.. గుడ్డు లేకపోయినా అచ్చం ఆమ్లెట్ లాంటి రుచిని, ఆకృతిని పొందవచ్చని మీకు తెలుసా? శాకాహారుల కోసం ఒక సరికొత్త రుచిని పరిచయం చేస్తోంది. అన్నంలోకి సైడ్ డిష్ తో పాటు.. పిల్లలకు ఈవినింగ్ స్నాక్ గా కూడా మారిపోతుంది. మరి దీని తయారీ విధానమెలాగో చూసేయండి..

Veg Omelet Recipe: గుడ్డు లేకుండానే వెజ్ ఆమ్లెట్.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్..
Eggless Bread Omelet Recipe
Bhavani
|

Updated on: Mar 28, 2026 | 3:20 PM

Share

చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీలో కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. పిండిని ఎలా కలపాలి? బ్రెడ్ ముక్కలను ఎలా వేయించాలి? చాట్ మసాలా, బేకింగ్ పౌడర్ వాడకం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కేవలం పది నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ రుచికరమైన స్నాక్ రెసిపీని తెలుసుకోండి..

ముఖ్యమైన పదార్థాలు:

శనగపిండి: 1.5 కప్పులు

బియ్యపు పిండి: 0.5 కప్పు

మసాలాలు: చాట్ మసాలా, పసుపు, బేకింగ్ పౌడర్, ఉప్పు

కూరగాయలు: సన్నగా తరిగిన టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర

ఇతరాలు: బ్రెడ్ ముక్కలు, నెయ్యి లేదా వెన్న

తయారీ విధానం :

ఒక మిక్సింగ్ బౌల్‌లో శనగపిండి, బియ్యపు పిండి, మసాలాలు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా నునుపుగా కలపాలి.

ఈ పిండి మిశ్రమంలో సన్నగా తరిగిన టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను రెండు వైపులా తేలికగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

బాణలిని మళ్ళీ వేడి చేసి, సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని మధ్యస్థ మందంతో పరచాలి. అంచుల వెంబడి నెయ్యి వేయాలి.

మిశ్రమం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే, వేయించిన బ్రెడ్‌ను దానిపై ఉంచి, ఆమ్లెట్ అంచులను బ్రెడ్‌పైకి మడవాలి. వెన్నతో రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే వేడివేడి వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ సిద్ధం!

చిన్న చిట్కా: పిండిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కలపడం వల్ల వెజ్ ఆమ్లెట్ మెత్తగా, పొంగినట్టుగా వస్తుంది.

Follow Us
భారీ గ్రహాల మార్పు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా .. మీరున్నారా?
భారీ గ్రహాల మార్పు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా .. మీరున్నారా?
టైటిల్ చూసి చీ కొట్టిన జనాలు.. అయినా 10 ఏళ్లుగా ట్రెండింగ్..
టైటిల్ చూసి చీ కొట్టిన జనాలు.. అయినా 10 ఏళ్లుగా ట్రెండింగ్..
మీరు ఎప్పుడూ రుచి చూడని వెజ్ బ్రెడ్ ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోద్ది
మీరు ఎప్పుడూ రుచి చూడని వెజ్ బ్రెడ్ ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోద్ది
సమ్మర్‌ స్పెషల్..పెసరపప్పు చారుతో పుష్కలమైన ఆరోగ్యం, రుచి!
సమ్మర్‌ స్పెషల్..పెసరపప్పు చారుతో పుష్కలమైన ఆరోగ్యం, రుచి!
మీల్ మేకర్ ఆమ్లెట్ ఇలా చేస్తే పక్కింటి వాళ్లు అసూయపడాల్సిందే
మీల్ మేకర్ ఆమ్లెట్ ఇలా చేస్తే పక్కింటి వాళ్లు అసూయపడాల్సిందే
ప్రపంచంలోనే అతిపెద్ద పండు ఏది..? కాండానికే కాయలు.. బరువులో రారాజు
ప్రపంచంలోనే అతిపెద్ద పండు ఏది..? కాండానికే కాయలు.. బరువులో రారాజు
తియ్యగా ఉండే కర్బూజ ఎట్లా ఎంచుకోవాలి? ఈ 5 సులభమైన చిట్కాలతో..
తియ్యగా ఉండే కర్బూజ ఎట్లా ఎంచుకోవాలి? ఈ 5 సులభమైన చిట్కాలతో..
6,6,6,6,6,6,6,6,6.. తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ విశ్వరూపం..?
6,6,6,6,6,6,6,6,6.. తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ విశ్వరూపం..?
సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలియడం లేదా? ఈజీగా తెలుసుకోండిలా!
సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలియడం లేదా? ఈజీగా తెలుసుకోండిలా!
ఆ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న వైష్ణవి..
ఆ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న వైష్ణవి..