Sleep Weight Loss: అతిగా నిద్రపోతే లావెక్కుతారా?.. మీ బాడీకి అసలైన శత్రువు ఎవరో తెలిస్తే షాకవుతారు..
బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటల తరబడి కష్టపడటం లేదా కఠినమైన డైటింగ్ చేయడం మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మీ శరీరం ఒక మెషీన్ లాగా పనిచేస్తూ కేలరీలను ఖర్చు చేస్తుందని మీకు తెలుసా? నిద్రకు, బరువు తగ్గడానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా?.. అసలు అతిగా పడుకునే వారిలో నిజంగానే బరువు పెరిగే సమస్య ఉంటుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక సామాన్య వ్యక్తి 8 గంటల నిద్రలో ఎన్ని కేలరీలు బర్న్ చేయగలడు? ఇది చాలా మందికి ఉండే డౌటే.. అయితే ఇదొక్కటే కాదు అసలు రాత్రి పూట మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు బరువు తగ్గకుండా ఎలా అడ్డుకుంటున్నాయి? పడుకునే ముందు ఫోన్‌కు దూరంగా ఉంటే బరువు ఎందుకు తగ్గుతారు? అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం..
క్యాలరీల దహనం: మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు, ఊపిరితిత్తులు గుండె పని చేస్తూనే ఉంటాయి. ఈ ప్రక్రియలో సాధారణంగా ఒక వయోజనుడు 8 గంటల నిద్రలో సుమారు 400 కేలరీలు ఖర్చు చేస్తారు. జీవక్రియ (Metabolism) వేగంగా ఉన్నవారు ఏకంగా 500 కేలరీల వరకు దహించగలరు.
రాత్రి భోజనం సమయం: రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా ఆహారం కొవ్వుగా మారుతుంది. అందుకే త్వరగా భోజనం చేయడం ఉత్తమం.
వ్యాయామం నిద్ర: నిద్రపోయే ముందు తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల నిద్రలో క్యాలరీల దహనం వేగవంతం అవుతుంది.
డిజిటల్ డిటాక్స్: పడుకునే ముందు ఫోన్, కంప్యూటర్ లేదా టీవీ చూడటం వల్ల మెదడు చురుగ్గా మారి నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
కెఫిన్ ప్రభావం: నిద్రకు ముందు కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలు తాగడం వల్ల గాఢ నిద్ర ఉండదు, ఫలితంగా శరీర బరువు నియంత్రణ తప్పుతుంది.
సరైన నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మీ బరువును తగ్గించే ఒక సహజమైన ఔషధం. పైన చెప్పిన నియమాలు పాటిస్తూ నిద్రపోతే ఆరోగ్యకరమైన మార్పును మీరే గమనిస్తారు.
చిన్న చిట్కా: చీకటి గదిలో నిద్రపోవడం వల్ల శరీరంలో ‘మెలటోనిన్’ ఉత్పత్తి పెరిగి, నిద్ర నాణ్యత మెరుగుపడటమే కాకుండా కేలరీలు కూడా బాగా ఖర్చవుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆరోగ్య పరమైన ఎలాంటి మార్పులు చేసుకునేముందైనా కచ్చితంగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
