Tata Altroz Racer: త్వరలోనే మార్కెట్‌లోకి నయా టాటా కారు.. ఫీచర్స్ చూస్తే మతిపోతుందంతే..!
టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఆల్టోజ్ రేసర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కార్ల ప్రియులు ఈ కారు రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ కారును ఇటీవలే 2024 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. టాటా ఆల్ట్రోజ్ రేసర్ అనేది ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ వెర్షన్‌కు రేసర్ అనేది స్పోర్టియర్ వెర్షన్‌గా పేర్కొంటున్నారు.

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఆల్టోజ్ రేసర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కార్ల ప్రియులు ఈ కారు రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ కారును ఇటీవలే 2024 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. టాటా ఆల్ట్రోజ్ రేసర్ అనేది ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ వెర్షన్‌కు రేసర్ అనేది స్పోర్టియర్ వెర్షన్‌గా పేర్కొంటున్నారు. ఈ కారు రిలీజ్ అయితే సేల్స్ చార్ట్‌లో బాగా అమ్ముడయ్యే కార్లల్లో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాటా ఆల్ట్రోజ్ కారుకు ఎప్పటి నుంచో అప్‌డేట్‌లు రాలేదు. ఈ నేపథ్యంలో స్పోర్టీ వెర్షన్‌లో నయా ఆల్ట్రోజ్ రేసర్‌ను రిలీజ్ చేసింది.
టాటా ఆల్టోజ్ రేసర్ దాని స్పోర్టీ క్యారెక్టర్‌కు అనువగా ఉంటుంది. బోనెట్, కారు పైకప్పుపై రెండు లైన్స్‌తో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. అలాగే ఈ కారు రీ డిజైన్ చేసిన గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు ఫెండర్లపై ‘రేసర్’ బ్యాడ్జితో వస్తుంది. ఈ డిజైన్ గతంలో మోడల్ ప్రారంభ సమయంలో ప్రదర్శించారు. కారు లోపలి భాగం డ్యాష్ బోర్డ్‌లో కాంట్రాస్ట్ స్టిచింగ్, కలర్ యాక్సెంట్లతో కూడిన లెథెరెట్ అష్టోల్స్టరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన స్పోర్టీ ఫీల్‌ను మరింత మెరుగుపర్చేందుకు ఈ అప్‌డేట్స్‌ను ఇచ్చాని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాటా ఆల్ట్రోజ్ కారు 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్- అప్ డిస్ప్లే, వాయిస్-కమాండ్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్లు, ఈఎస్‌సీ స్టాండర్డ్ ఫీచర్లతో వస్తుంది. భవిష్యత్తులో ఈ ఫీచర్లను కారు స్టాండర్డ్ వేరియంట్లలో చేర్చే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారులో 1.2 లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు గరిష్ట పనితీరులో పవర్ యూనిట్ 120 హెచ్‌పీ శక్తిని, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు స్పోర్టీ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








