Mahindra BE05: రోడ్లపై మహీంద్రా ఈవీ కారు రయ్..రయ్.. డిజైన్ విషయంలో ఈ కారుకు లేదు సాటి
మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లోకి చాలా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. బ్రాండ్ ఎక్స్‌యూవీ, బీఈ మోనికర్ల వెర్షన్లలో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తుంది. బీఈ వేరయంట్‌లో మొదటి ఎలక్ట్రిక్ వాహనం బీఈ05. మహీంద్రా దీనిని స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎస్ఈవీ) అని పిలుస్తున్నారు. ఈ కారు అక్టోబర్ 2025లో ప్రారంభించే అవకాశం ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లోకి చాలా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. బ్రాండ్ ఎక్స్‌యూవీ, బీఈ మోనికర్ల వెర్షన్లలో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తుంది. బీఈ వేరయంట్‌లో మొదటి ఎలక్ట్రిక్ వాహనం బీఈ05. మహీంద్రా దీనిని స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎస్ఈవీ) అని పిలుస్తున్నారు. ఈ కారు అక్టోబర్ 2025లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ ఎస్ఈబీ ఇటీవల భారతీయ రోడ్లపై కనిపించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ లాంగ్వేజ్‌ను ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా బీఈ 05 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ ఎస్ఈవీకు సంబంధించిన మొత్తం డిజైన్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రదర్శించబడిన కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ లాగా ఉంది. అయితే ప్రొడక్షన్ వెర్షన్ భారతీయ రహదారి పరిస్థితులకు బాగా సరిపోయేలా సైడ్వాల్ టైర్లతో కూడిన చిన్న అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. మహీంద్రా బీఈ.05 ఇంగ్లో ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతు ఇస్తుంది. ఇదే ప్లాట్‌ఫారమ్‌ను మహీంద్రా తయారు చేయనున్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఉపయోగించనున్నారు. మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ పొడవు 4,370 ఎంఎం, వెడల్పు 1,900 ఎంఎం, ఎత్తు 1,635 ఎంఎం ఉంటుంది. వీల్‌బేస్ 2,775 మిమీ వద్ద ఉంటుంది.
ఇంగ్లో అనేది స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్. ఇది 4.3 మీటర్లు, 5 మీటర్ల మధ్య ఉండే వాహనాన్ని అండర్ పిన్ చేయగలదు. మహీంద్రా ఫ్లోర్బోర్డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫ్లోర్ ఫ్లాట్‌గా ఉండడం వల్ల ముగ్గురు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరు. ప్లాట్‌ఫారమ్‌లోనే 60 కేడబ్ల్యూహెచ్- 80 కేడబ్ల్యూహెచ్ మధ్య బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. బ్యాటరీ ప్యాక్ బ్లేడ్ బ్యాటరీలతో పాటు ప్రిస్మాటిక్ బ్యాటరీ ప్యాక్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాటరీలు 175 కేడబ్ల్యూ వేగంతో ఛార్జ్ చేయగలవు కాబట్టి 0-80 శాతం బ్యాటరీని 30 నిమిషాలలోపు ఛార్జ్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








