AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI PPF Scheme: రూ. 8వేలతో.. రూ. 25లక్షలు సంపాదించే అవకాశం.. ఈ లెక్క చూడండి ఆశ్చర్యపోతారు..

ఈ పథకాన్ని అన్ని పోస్టాఫీసులు, అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. వాటిల్లో దేశంలోని అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ ప్రత్యేకమైన పీపీఎఫ్ పథకాన్ని అందిస్తోంది. దీనిలో మీరు రూ. 8,000 చొప్పున పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ. 25.24లక్షలు వస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

SBI PPF Scheme: రూ. 8వేలతో.. రూ. 25లక్షలు సంపాదించే అవకాశం.. ఈ లెక్క చూడండి ఆశ్చర్యపోతారు..
PPF
Madhu
|

Updated on: May 29, 2024 | 7:17 PM

Share

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ పొదుపు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నా.. ఎక్కువ శాతం మంది పోస్టాఫీసులు, జాతీయ బ్యాంకుల్లోనే తమ పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు. వీటి ప్రభుత్వ మద్దతు ఉంటుందన్న భావన వారిలో ఎక్కువగా ఉంటోంది. వడ్డీ కాస్త తక్కువైనా తమ పెట్టుబడికి గ్యారంటీ రాబడి రావాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి ఆలోచనలోనే ఉంటే మీకో మంచి పథకం అందుబాటులో ఉంది. అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్). ఈ పథకాన్ని అన్ని పోస్టాఫీసులు, అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. వాటిల్లో దేశంలోని అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఓ ప్రత్యేకమైన పీపీఎఫ్ పథకాన్ని అందిస్తోంది. దీనిలో మీరు రూ. 8,000 చొప్పున పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ. 25.24లక్షలు వస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్బీఐ స్పెషల్ పీపీఎఫ్ స్కీమ్..

ఎస్బీఐ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనిలో మీరు మీరు చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద బ్యాంకు మంచి వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ పథకంలో మీ పెట్టుబడి మొత్తం 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ప్రస్తుతం, ఈ పీపీఎఫ్ పథకంలో 7.1 శాతం వడ్డీని అందజేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూనే ఉంటుంది.

500తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు..

ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏటా కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి వారి పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అదే సమయంలో, దానిపై వచ్చే వడ్డీ కూడా సెక్షన్ 10 కింద పన్ను పరిధికి దూరంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఖాతా తెరవవచ్చు..

ప్రస్తుతం, 15 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఈ పీపీఎఫ్ ​​పథకంలో 7.1 శాతం వార్షిక వడ్డీ అందిస్తున్నారు. బ్యాంకుతో పాటు, మీరు పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఆన్‌లైన్ ఖాతా తెరిచే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. మీరు మీ సేవింగ్స్ ఖాతా సహాయంతో దీన్ని తెరవవచ్చు. దీని కోసం మీరు బ్యాంకు శాఖకు వెళ్లవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో మీ ఖాతాలోకి లాగిన్ చేయడం ద్వారా మీరు దీన్ని తెరవవచ్చు.

నెలవారీ రూ.8000 పెట్టుబడితో..

స్టేట్ బ్యాంక్ ఈ ప్రత్యేక పథకంలో మీరు ప్రతి నెలా రూ. 8000 పెట్టుబడి పెడితే, మీరు లక్షల విలువైన నిధులను సేకరించవచ్చు. లెక్కల ప్రకారం, నెలకు రూ. 8000 డిపాజిట్ చేయడం ద్వారా, ఒక సంవత్సరంలో రూ. 96,000 జమ అవుతుంది. 15 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ మొత్తం రూ.14,40,000 అవుతుంది. డిపాజిట్ చేసిన ఈ మొత్తానికి 7.1 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. కాబట్టి లెక్క ప్రకారం మెచ్యూరిటీలో రూ.25,24,544 ఫండ్ సిద్ధంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 14,40,000 కాగా మీకు రూ. 10,84,544 వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..