HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం.. ఆ లావాదేవీలపై SMS అలర్ట్‌లు నిలిపివేత..ఎందుకో తెలుసా?
దేశంలో బ్యాంకులు కొత్త కొత్త మార్పులు చేస్తుంటాయి. యూపీఐ లావాదేవీలు సైతం భారీగానే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేస్తే SMS అలర్ట్ అందించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తన వినియోగదారులకు సందేశాలను పంపింది బ్యాంకు..

దేశంలో బ్యాంకులు కొత్త కొత్త మార్పులు చేస్తుంటాయి. యూపీఐ లావాదేవీలు సైతం భారీగానే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేస్తే SMS అలర్ట్ అందించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తన వినియోగదారులకు సందేశాలను పంపింది బ్యాంకు. ఈ నిబంధన జూన్ 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
100 రూపాయల కంటే తక్కువ ఉన్న చెల్లింపులపై ఎస్‌ఎంఎస్ అందుకోలేరని తెలిపింది. అలాగే రూ.500 కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై కూడా ఎస్‌ఎంఎస్ అలర్ట్ ఉండబోదని తెలిపింది. వినియోగదారులు వంద కంటే ఎక్కువ చెల్లింపులు, రూ.500 కంటే ఎక్కువ డిపాజిట్లకు మాత్రమే ఎస్‌ఎంఎస్ అలర్ట్ అందుకుంటారని తెలిపింది. కస్టమర్ల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది. యూపీఐ (UPI) యాప్‌ల నుంచి నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో చిన్న మొత్తం లావాదేవీలకు ప్రత్యేకంగా అలర్ట్‌లు అవసరం లేదని పలువురు ఖాతాదారుల నుంచి ఫీడ్ బ్యాంక్ ద్వారా తెలియజేశారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఎస్‌ఎంఎస్‌లకు పెద్ద మొత్తంలో ఖర్చు
ఇదిలా ఉండగా చిన్న చిన్న లావాదేవీలకు సందేశాలు పంపడం వల్ల కోట్లాది ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లకు చేరుతున్నాయని, దీని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని బ్యాంకు వెల్లడించింది. ఇలా చిన్న పాటి లావాదేవీలకు సందేశాలు నిలిపివేయడం వల్ల కొంత డబ్బు ఆదా అవుతుందని బ్యాంకు అభిప్రాయపడింది. అలాగే బ్యాంకు ఖాతాదారులు తమ ప్రైమరీ ఈ-మెయిల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సూచించింది. తాజా నిర్ణయంతో హెచ్‌డీఎఫ్‌సీకి ఆ మేరకు కొంత నిర్వహణ వ్యయం తగ్గనుంది. మరోవైపు ఖాతాదారులంతా తమ ప్రైమరీ ఈమెయిల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంకు సూచించింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకు వెన్నెముకగా మారింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా అభివృద్ధి అయ్యింది. యూపీఐ అనేది IMPS మౌలిక సదుపాయాలపై నిర్మించిన తక్షణ చెల్లింపు వ్యవస్థ. ఏదైనా రెండు బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణమే డబ్బును బదిలీ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు 2023లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెద్ద మొత్తంలో ఉన్న 117.6 బిలియన్ లావాదేవీల విలువ రూ.183 ట్రిలియన్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే వాల్యూమ్‌లో 59 శాతం. అలాగే విలువలో 45 శాతం గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఇది దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




