AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rule Change From July 2023: వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 1 నుంచి వీటిపై మారనున్న నిబంధనలు

జూన్ నెల ముగియనుంది. కొత్త నెల జూలై ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిసారీ మాదిరిగానే, ఈసారి కూడా చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. వంటగ్యాస్, కమర్షియల్ గ్యాస్, సీఎన్‌జీ-పీఎన్‌జీ సహా పలు వస్తువుల ధరలు, నిబంధనలలో మార్పు కానున్నాయి..

Rule Change From July 2023: వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 1 నుంచి వీటిపై మారనున్న నిబంధనలు
Rule Change From July 2023
Subhash Goud
|

Updated on: Jun 27, 2023 | 5:13 PM

Share

జూన్ నెల ముగియనుంది. కొత్త నెల జూలై ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిసారీ మాదిరిగానే, ఈసారి కూడా చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. వంటగ్యాస్, కమర్షియల్ గ్యాస్, సీఎన్‌జీ-పీఎన్‌జీ సహా పలు వస్తువుల ధరలు, నిబంధనలలో మార్పు కానున్నాయి. జూలై నెలలో జరిగే ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. మీరు వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. జూలై 1 ఎలాంటి మార్పులు జరుగనున్నాయో తెలుసుకోండి.

ఎల్‌పీజీ గ్యాస్‌ ధర మార్పు:

LPG గ్యాస్ ధరను దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా నిర్ణయిస్తాయి. ఒకటో తేదీన ధర పెరగొచ్చు.. తగ్గొచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో జూలైలో ఎల్పీజీ గ్యాస్ రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మే, ఏప్రిల్ నెలల్లో 19 కిలోల వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించగా, 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగానే ఈసారి ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

క్రెడిట్ కార్డ్ ఖర్చులపై 20% టీసీఎస్‌:

విదేశాల్లో క్రెడిట్ ద్వారా ఖర్చు చేయడంపై టీసీఎస్‌ని వర్తింపజేయడానికి ఒక నిబంధన ఉంది. ఇది 1 జూలై 2023 నుంచి వర్తిస్తుంది. దీని కింద 7 లక్షల కంటే ఎక్కువ ఖర్చుపై 20% వరకు టీసీఎస్‌ ఛార్జీ విధించబడుతుంది. అయితే విద్య, వైద్యానికి ఈ ఛార్జీ 5%కి తగ్గించబడుతుంది. అయితే మీరు విదేశాల్లో విద్యా రుణం తీసుకుంటున్నట్లయితే ఈ ఛార్జీ మరింత 0.5 శాతానికి తగ్గించబడుతుంది.

ఇవి కూడా చదవండి

సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో మార్పు:

ప్రతి నెలలాగే ఈ నెల కూడా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలలో మార్పు ఉండవచ్చు. ఢిల్లీ, ముంబైలలోని పెట్రోలియం కంపెనీలు మొదటి తేదీన గ్యాస్ ధరను మారుస్తాయి.

ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి చివరి తేదీ:

ప్రతి పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌ ఫైల్ చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలుకు చివరి తేదీ జూలైతో ముగియనుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే, జూలై 31 లోపు ఫైల్ చేయండి.

తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?