Link PAN-Aadhaar: పాన్ ఆధార్ లింక్ చేద్దామంటే ‘ఎర్రర్’ వస్తుందా? గడువు ముగిసేలోపు ఇలా చేయండి..
పాన్, ఆధార్ కార్డు లింకు చేయాలని భావించి తొందరపడుతున్న కొంతమందికి ‘ఎర్రర్’ అని చూపుతోంది. దీనికి కారణం ఆధార్ కార్డులోని డేటా, అలాగే పాన్ కార్డులోని డేటాకు సరిపోకపోవడం. అంటే పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు రెండింటిలోనూ ఒకేవిధంగా లేకపోతే పాన్ ఆధార్ లింక్ ప్రక్రియ ఫెయిల్ అవుతుంది.
పాన్-ఆధార్ లింక్.. ఏంటిది? ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ కనిపిస్తోంది. వాస్తవానికి పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఇది ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇస్తుంది. దీనిలో అంకెలు, అక్షరాలతో కలిపి పది డిజిట్లు ఉంటాయి. ఏ ఆర్థిక లావాదేవీ చేయాలన్నా ఈ పాన్ నంబర్ ఉండాల్సిందే. కనీసం బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఇది తప్పనిసరి. ఇక ఆధార్ నంబర్ వచ్చేసరికి భారతీయ పౌరుడికి ఇది ఒక గుర్తింపు. ఇది 12 అంకెలతో ఉంటుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన నంబర్ తో ఈ కార్డును అందిస్తారు. అయితే గత కొంతకాలంగా ఈ పాన్, ఆధార్ లింక్ చేయమని ప్రభుత్వం సూచిస్తోంది. అనేక రకాలుగా అవగాహన కల్పించింది. పలు దఫాలుగా గడువులు విధించింది. ఇప్పుడు రూ.1000 జరిమానాతో 2023 జూన్ 30లోపు లింక్ ప్రక్రియ పూర్తి చేయాలని చెబుతోంది. ఆ సమయానికి చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని, అన్ని ఆర్థిక లావాదేవీలకు ఇబ్బంది పడతారని చెబుతోంది. ముఖ్యంగా ట్యాక్స్ చెల్లింపుదారులు ఇంకా ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే లింక్ చేసేశారు.
ఎర్రర్ వస్తుంది ఎందుకు?
పాన్, ఆధార్ కార్డు లింకు చేయాలని భావించి తొందరపడుతున్న కొంతమందికి ‘ఎర్రర్’ అని చూపుతోంది. దీనికి కారణం ఆధార్ కార్డులోని డేటా, అలాగే పాన్ కార్డులోని డేటాకు సరిపోకపోవడం. అంటే పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు రెండింటిలోనూ సక్రమంగా లేకపోతే పాన్ ఆధార్ లింక్ ప్రక్రియ ఫెయిల్ అవుతోంది. అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం..
ఎర్రర్ కు ప్రధాన కారణాలు ఇవి..
పేరు మిస్ మ్యాచ్ అవడం, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అవడం, జెండర్ మిస్ మ్యాచ్ అవడం, ఈ కారణాల వల్ల మీ లింకింగ్ ప్రక్రియ ఫెయిల్ అయితే ఆ రెండింటిలో దేనిలో తప్పుగా ఉందో దానిని మార్చుకుంటే సరిపోతోంది. అదే విధంగా మరికొన్నిసందర్బాల్లో డెమోగ్రాఫిక్ మిస్ మ్యాచ్ వస్తుంది. అలాంటప్పుడు పాన్ సర్వీస్ ప్రోవైడర్ల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ అథంటికేషన్ చేసుకోవాలి. వీరిని ప్రోటియన్, యూటీఐఐటీఎస్ఎల్ అని పిలుస్తారు.
పాన్ లో డేటా అప్ డేట్ చేయడం ఇలా..
- పాన్ కార్డులో మీ డేటాను అప్ డేట్ చేయడానికి ప్రోటీయన్ వెబ్ సైట్ లోకి వెళ్లి చేసుకోవచ్చు.
- అలాగే యూటీఐఐటీఎస్ లింక్ ద్వారా కూడా అప్ డేట్ చేసుకోవచ్చు
ఆధార్ కార్డ్‌లోని వివరాలను అప్‌డేట్ చేయడానికి..
- ఆధార్ కార్డులోని డేటా అప్ డేట్ చేయడానికి యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి చేసుకోవచ్చు. అందుకోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి.
ఆయా వెబ్ సైట్లలో అప్ డేట్ చేయడం పూర్తయిన తర్వాత మళ్లీ ఆధార్, పాన్ లింక్ చేయడాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. అందుకోసం ఈ లింక్ ని వినియోగించుకోవచ్చు.
అప్పటికీ విఫలం అయితే..
లింకింగ్ అభ్యర్థన అప్పటికీ విఫలమైతే, మీరు పాన్ సర్వీస్ ప్రొవైడర్ల (ప్రోటియన్ మరియు యూటీఐఐటీఎస్) వద్దకు వెళ్లి ప్రత్యేక కేంద్రాలలో నామమాత్రపు రుసుం రూ. 50 చెల్లించడం ద్వారా ‘బయోమెట్రిక్ అథంటికేషన్ ద్వారా చేసుకోవచ్చు. అయితే అక్కడకు వెళ్లే ముందు పాన్ కార్డు, ఆధార్ కార్డు, లింక్ కోసం చెల్లించాల్సిన రుసుం కట్టిన చాలానా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేంద్రాల వివరాలను పొందడానికి, ఈ సేవలను అందించే వెబ్‌సైట్‌లను సందర్శించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..