E-Passport 2.0: పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? మీకో గుడ్‌న్యూస్
పాస్‌పోర్ట్ విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకువస్తోంది. వినియోగదారుని డేటాకు పూర్తి భద్రత ఉండేలా చిప్‌తో కూడిన పాస్‌పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. డేటా భద్రతతో పాటు విదేశాలకు వెళ్లడం సులభతరం అవుతుందని కేంద్రం భావిస్తోంది..
ఈ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాస్‌పోర్టు తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త. కొత్తగా వచ్చే ఈ టెక్నాలజీ ద్వారా చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను పొందుతారని మంత్రి తెలిపారు. కొత్త చిప్‌లతో అధునాతన, అప్‌గ్రేడ్ చేసిన పాస్‌పోర్ట్‌లను సిద్ధం చేయడానికి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
ప్రధాని ఈజ్ ఆఫ్ లైఫ్ విధానాన్ని అమలు చేస్తున్నారని, ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో నిరంతరం సహకరిస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ-పాస్‌పోర్ట్ సదుపాయం సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఈ పాస్‌పోర్ట్‌లలో చిప్ ప్రారంభించనున్నట్లు, దీంతో ప్రజలు సులభంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. అంతేకాకుండా దీని వల్ల అందులో ఉండే డేటా ఎంతో సురక్షితంగా ఉంటుందన్నారు.
Here is a message from EAM @DrSJaishankar, as we observe the Passport Seva Divas today. #TeamMEA reaffirms its commitment to provide passport and related services to citizens in a timely, reliable, accessible, transparent and efficient manner. pic.twitter.com/k1gmaTPLKq
— Arindam Bagchi (@MEAIndia) June 24, 2023
ఇ-పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ 2.0 అంటే ఏమిటి?
ఇ-పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్ 2.0 కింద అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పాస్‌పోర్ట్‌లు తయారు చేయబడతాయి. ఇందులో అత్యాధునిక బయోమెట్రిక్ టెక్నాలజీని కూడా ఉపయోగించనున్నారు. AI అధునాతన డేటా విశ్లేషణ, చాట్ బాట్, భాషా ప్రాధాన్యతతో కూడిన క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఉపయోగించి ఈ పాస్‌పోర్ట్‌లు తయారు అవుతాయన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి