Electricity Rules: రాత్రి సమయంలో కరెంట్ వాడితే చార్జీల షాక్ తప్పదు..
అబ్బో వేడి భరించలేకపోతున్నాం.. ఏసీ వేసుకుని చల్లగా పడుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ.. తరువాత పర్స్ పేలిపోతుంది. అవును. ఇది నిజం. ఇప్పుడు కరెంట్ బిల్లు మామూలుగానే జేబుకు చిల్లు పెడుతోంది. భవిష్యత్ లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వంద యూనిట్లు వరకూ ఇంత అది..
అబ్బో వేడి భరించలేకపోతున్నాం.. ఏసీ వేసుకుని చల్లగా పడుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ.. తరువాత పర్స్ పేలిపోతుంది. అవును. ఇది నిజం. ఇప్పుడు కరెంట్ బిల్లు మామూలుగానే జేబుకు చిల్లు పెడుతోంది. భవిష్యత్ లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వంద యూనిట్లు వరకూ ఇంత అది దాటితే ఇంత అని స్లాబ్స్ ఉన్నాయి. కానీ, రాబోయే రోజుల్లో పగలు వాడిన కరెంట్ కు ఒక రేటు.. రాత్రి వాడిన కరెంట్ కు ఒక రేటు రాబోతున్నాయి. ఈ మేరకు కరెంట్ చార్జీల నియమ నిబంధనల్లో మార్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది.
కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న ఈ కరెంట్ చార్జీల విధానం పేరు టైమ్ ఆఫ్ డే (ToD) టారిఫ్ సిస్టమ్. పేరుకు తగ్గట్టుగానే.. మనం కరెంట్ వాడిన టైమ్ ను బట్టి చార్జీల మోత మొగుతుంది. ఉదయం వేళలో కరెంట్ వాడితే 20 శాతం వరకు చార్జీల భారం తగ్గుతుంది. అలానే రాత్రి సమయంలో ముఖ్యంగా పీక అవర్ లో కరెంట్ వినియోగంపై 10 నుంచి 20 శాతం వరకూ చార్జీల బాదుడు ఉంటుంది. ఈ విధానాన్ని మొదట కమర్షియల్, ఇండస్ట్రియల్ కరెంట్ వినియోగించే వారికి తీసుకు వస్తారు. అంటే 10 కిలోవాట్ అంత కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న రంగాలకు 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. తరువాత హౌస్ హోల్డ్ కరెంట్ వినియోగంపై ఈ విధానాన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి తీసుకువస్తారు. ఇందులో వ్యవసాయ విడిట్ కు మినహాయింపు ఉంటుంది.
ఈ విధానంలో ఏ సమయంలో ఎంత కరెంట్ వాడారు అనేది తెలుసుకోవడం కోసం స్మార్ట్ మీటర్లను వినియోగిస్తారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. గ్రిడ్ ల మీద పడుతున్న భారాన్ని తగ్గించడానికే ఈ విధానం తీసుకువస్తున్నటు కేంద్ర విద్యుత్ విభాగం చెబుతోంది. అంటే.. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో వినియోగదారులు ఎక్కువ కరెంట్ వాడుకునేలా ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్ ల పై పడుతున్న డిమాండ్ తగ్గించాలనేది కేంద్రం ఆలోచన.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. వచ్చే నాలుగేళ్ల కాలంలో విద్యుత్ వాడకం మరింతగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. అయితే గత ఏడాది మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 4 శాతం ఉండగా, 2027 మార్చి నాటికి సుమారు 7.2 శాతానికి చేరుకునే అవకాశం ఉందని కేంద్ర అంచనా వేస్తోంది. దాంతోపాటు స్మార్ట్ మీటర్ నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. అయితే విద్యుత్ స్మార్ట్ మీటర్స్ బిగించిన తేదీకి ముందుకు వాడిని కరెంట్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి