Kabira Hermes 75 EV: డెలివరీ బాయ్స్ కోసం మార్కెట్‌లోకి నయా ఈవీ… గతుకుల రోడ్డుల్లోనూ సూపర్ సస్పెన్షన్‌తో రయ్..రయ్..
గ్రామీణ ప్రాంతాల్లోని కఠినమైన రోడ్లపై ఈవీ వాహనాలను రైడ్ చేయడానికి కొంత ఇబ్బందిగా ఉండడంతో ఇప్పటికీ కొంతమంది కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా కబీరా మొబిలిటీ సూపర్ సస్పెన్షన్‌తో హీర్మేస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కబీరా హెర్మేస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్ బలమైన స్టీల్ ఫ్రేమ్, రీన్ఫోర్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్‌తో తయారు చేశారు.
గోవా ఆధారిత ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు కబీరా మొబిలిటీ మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. సాధారణంగా ఈవీ స్కూటర్లు ఎక్కువగా పట్టణ ప్రాంత ప్రజలనే ఆకట్టుకుంటున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కఠినమైన రోడ్లపై ఈవీ వాహనాలను రైడ్ చేయడానికి కొంత ఇబ్బందిగా ఉండడంతో ఇప్పటికీ కొంతమంది కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా కబీరా మొబిలిటీ సూపర్ సస్పెన్షన్‌తో హీర్మేస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కబీరా హెర్మేస్ 75 ఎలక్ట్రిక్ స్కూటర్ బలమైన స్టీల్ ఫ్రేమ్, రీన్ఫోర్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్‌తో తయారు చేశారు. ముఖ్యంగా కఠినమైన రోడ్డుల్లో సౌకర్యవంతమైన ప్రయాణం ఈ స్కూటర్‌తో సాధ్యమని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ స్కూటర్ డెలివరీ బాయ్స్‌కు అద్భుతంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యుత్తమ పనితీరును కలిగి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కబీరా హెర్మేస్ 75 ఆధునిక డిజైన్‌తో తయారు చేశారు. ఇది ఎర్గోనామిక్ సీటింగ్, విశాలమైన కార్గో ప్రాంతం ఉంది. అలాగే ఈ స్కూటర్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
కబీరా ఎలక్ట్రిక్ స్కూటర్ హీర్మేస్ 75 కెపాసిటీ 3.28 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్‌లో భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ లైఫ్ ఫీఓ 4 బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సుదీర్ఘ శ్రేణి కోసం మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ డెల్టా ఈవీ సిస్టమ్ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ బీఎంఎస్ బ్యాటరీ ప్యాక్‌కి అదనపు రక్షణ పొరను అందిస్తుంది. ఇది బ్యాటరీ ప్యాక్ మొత్తం భద్రతను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఈ బ్యాటరీ ప్యాక్ ఫైర్ ప్రూఫ్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇంటెలిజెంట్ ఎఫ్‌ఓసీ కంట్రోలర్ బైక్‌పై మంచి నియంత్రణను రైడర్‌కు అందిస్తుంది.
కబీరా హీర్మేస్ 75 గరిష్ట మోటార్ శక్తి 4,500 వాట్స్‌గా ఉంది అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 85 కిమీ వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఈ వాహనం 3.6 సెకన్లలో గంటకు 0 – 40 కి.మీల వేగాన్ని అందుకోగలదు. కబీరా మొబిలిటీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, 12-అంగుళాల టైర్లు, ఎర్గోనామిక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, మొబైల్ యాప్, ఎన్‌క్లోజ్డ్ వాటర్‌ప్రూఫ్ కన్సోల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. భారత మార్కెట్లో 99, 658గా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఈ స్కూటర్‌కు వచ్చే డిస్క్ బ్రేక్‌లు, డీఆర్ఎల్ హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ శారీ గార్డ్‌లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..