Netflix: నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ షేరింగ్‌ చేసుకుంటున్నారా.. అయితే డబ్బులు చెల్లించాల్సిందే..

ఈ మధ్య చాలా మంది  ఇంట్లోనే కూర్చుని హాయ్‌గా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకు వెళ్లే బదులు నెల, రెండు నెలలు ఆగితే ఇంట్లోనే చూసుకోవచ్చని అనుకుంటున్నారు...

Netflix: నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ షేరింగ్‌ చేసుకుంటున్నారా.. అయితే డబ్బులు చెల్లించాల్సిందే..
Netflix
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 17, 2022 | 8:25 PM

ఈ మధ్య చాలా మంది  ఇంట్లోనే కూర్చుని హాయ్‌గా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకు వెళ్లే బదులు నెల, రెండు నెలలు ఆగితే ఇంట్లోనే చూసుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఈ ఓటీటీలను సబ్‌స్ర్కైబ్‌ చేసుకున్నవారు వారి బంధువులకు, స్నేహితులకు ఓటీటీ పాస్‌వర్డ్ ఇచ్చేవారు. వారూ కూడా ఓటీటీలోని కార్యక్రమాలు చూసేవారు. అయితే, ఇలాంటి అకౌంట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల నష్టపోతున్నామని భావిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌కూ కొంత రుసుము వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

US-ఆధారిత స్టీమింగ్ సర్వీస్ చాలా కాలంగా వినియోగదారులు పాస్‌వర్డ్‌లను కుటుంబం లేదా స్నేహితులతో పంచుకోవడం కోసం రిలాక్స్డ్ విధానాన్ని అవలంబించింది. అయితే ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచాయి. సబ్‌స్ర్కైబర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేకపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీవలి నెట్‌ఫ్లిక్స్ ఆదాయాల నివేదిక ప్రకారం సంస్థ కేవలం 2.5 మిలియన్ల సబ్‌స్ర్కైబర్‌లను మాత్రమే కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాను పంచుకోవడం వల్ల నాణ్యమైన కొత్త కార్యక్రమాల రూపొందించే సామర్థ్యం తమకు తగ్గుతోందని నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రయోగత్మకంగా రాబోయే వారాల్లో చిలీ, కోస్టారికా, పెరూ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరు చేసుకునేవారికి రుసుము 2 డాలరు నుంచి 3 డాలర్ల వసూల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్‌ అదే చేస్తే ఇకపై అకౌంట్‌ను పంచుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారనుంది. మిగిలిన కంపెనీలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే ఒకే ఖాతాను ఇక వేర్వేరు వ్యక్తులు వినియోగించడం ఇక కష్టం కావొచ్చు.

Read Also.. Stock Market: బుల్‌ జోరు.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,047, నిఫ్టీ 311 పాయింట్లు అప్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!