AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meesho IPO: పబ్లిక్ ఇష్యూకు ‘మీషో’.. ఐపీఓకు సెబీ ఆమోదం.. లిస్టింగ్ ఎప్పుడంటే

Meesho IPO: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ ఫారం మీషో (Meesho) స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తోంది. కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ దాదాపు $480 మిలియన్లు (రూ.4,250 కోట్లు) సేకరించాలని యోచిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద $250-300..

Meesho IPO: పబ్లిక్ ఇష్యూకు 'మీషో'.. ఐపీఓకు సెబీ ఆమోదం.. లిస్టింగ్ ఎప్పుడంటే
Subhash Goud
|

Updated on: Oct 19, 2025 | 7:32 PM

Share

Meesho IPO: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ ఫారం మీషో స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మీషో ఐపీఓకు తాజాగా సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 6,600 కోట్లు సమీకరించాలని మీషో భావిస్తోంది. తన IPO కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ SEBIకి అప్‌డేట్‌ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP)ని సమర్పించింది. IPO కోసం ఆమోదం కూడా పొందింది. ఐపీవో పరిమాణం దాదాపు $700-800 మిలియన్లు (రూ.6,500-రూ.7,000 కోట్లు) ఉంటుందని అంచనా.

ఇది కూడా చదవండి: Diwali Offer: దీపావళి వేళ అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. సగం ధరకే Samsung Galaxy S24 FE ఫోన్‌!

కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ దాదాపు $480 మిలియన్లు (రూ.4,250 కోట్లు) సేకరించాలని యోచిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద $250-300 మిలియన్లు (రూ.2,200-రూ.2,600 కోట్లు) విలువైన షేర్లను అమ్మకానికి ఉంచనున్నారు. బుక్ బిల్డింగ్ ప్రక్రియకు మరో 30-45 రోజులు పడుతుంది. ఆ తర్వాత మీషో తన IPOను ప్రారంభించి, దాని వాల్యుయేషన్‌ను నిర్ణయిస్తుంది. OFS కింద పీక్ XV పార్టనర్స్, ఎలివేషన్ క్యాపిటల్, వెంచర్ హైవే, వై కాంబినేటర్, ఇతరులు వంటి మీషో ప్రారంభ పెట్టుబడిదారులు వాటాలను విక్రయిస్తారు. ప్రమోటర్లు విదిత్ అత్రే, సంజీవ్ బార్న్‌వాల్ కూడా OFS ద్వారా వాటాలను విక్రయిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ IPO ద్వారా వచ్చే నిధులను కంపెనీ టెక్నాలజీ ఖర్చులు, బ్రాండ్ బిల్డింగ్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఉపయోగిస్తుంది. మీషో ఇంకా లాభదాయకంగా లేదు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.7,615 కోట్ల ఆదాయం, రూ.305 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇది తన స్థావరాన్ని USAలోని డెలావేర్ నుండి భారతదేశానికి మార్చింది. సంబంధిత ఖర్చుల కారణంగా FY25లో దాని నష్టాలు పెరిగాయి.

మీషో నికర నష్టం FY25లో రూ.305 కోట్ల నుండి రూ.3,941 కోట్లకు పెరిగింది. పన్నుకు ముందు నష్, అసాధారణ అంశాలను మినహాయించి, FY25లో మీషో నికర నష్టం రూ.108 కోట్లు. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మీషో రూ.289 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.

ఇది కూడా చదవండిAadhaar: ఆధార్‌ విషయంలో సమస్యలు ఉన్నాయా? ఇదిగో హెల్ఫ్‌లైన్‌ నంబర్‌!

ఇది కూడా చదవండి: Indias Wealthiest Village: ఇది మన దేశంలో అత్యంత సంపన్న గ్రామం.. లగ్జరీ కార్లు, బ్యాంకు డిపాజిట్లు రూ. 1,000 కోట్లు.. ఇక్కడ వారిదే ఆధిపత్యం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి