- Telugu News Photo Gallery Business photos IRCTC new policy now you can reschedule your tickets without any charge
IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ల విషయంలో కొత్త విధానం
IRCTC: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇటువంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి. జపాన్, యూకే, యూరప్‌లలో ప్రయాణికులు ఇలాంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వేలు కూడా ఈ దిశగా కదులుతున్నాయి. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు భారత్ ..
Updated on: Oct 16, 2025 | 7:49 AM

Indian Railways: భారత రైల్వే టికెటింగ్ విధానంలో పలు కీలక మార్పులను చేస్తోంది. రైల్వే కొత్త టికెటింగ్ విధానం ప్రకారం, మీరు ఇప్పుడు మీ ధృవీకరించిన టికెట్‌ను రద్దు చేయడానికి బదులుగా ఇప్పుడు వేరే రోజున ప్రయాణించేందుకు తేదీని షెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంటే మీ ప్రయాణ తేదీ మారినట్లయితే టికెట్‌ను రద్దు చేసుకుని వేరే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్ అయిన టికెట్‌నే వేరే తేదీకి మార్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త తేదీని ఎంచుకుని ప్రయాణించవచ్చు.

ఈ మొత్తం సౌకర్యం IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు లాగిన్ అయి తమ బుక్ చేసుకున్న టిక్కెట్లను తనిఖీ చేసుకోవచ్చు. సీట్ల లభ్యత ఆధారంగా కొత్త తేదీ లేదా రైలును ఎంచుకోవచ్చు. దీనికి అదనపు ఛార్జీలు లేకుండా, ఛార్జీల వ్యత్యాసం (ఏదైనా ఉంటే) మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుత వ్యవస్థ ప్రకారం.. కన్పర్మ్ అయిన టికెట్‌ను రద్దు చేయడానికి 25% నుండి 50% ఖర్చవుతుంది. మీరు రైలును మిస్ అయితే మీకు వాపసు లభించదు. అయితే ఈ కొత్త వ్యవస్థ రద్దుల అవసరాన్ని తొలగిస్తుంది. ప్రయాణికులకు డబ్బు, సమయం రెండింటినీ ఆదా చేస్తుంది.

ఈ ఫీచర్ ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు లేదా నగరాల మధ్య తరచుగా ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు, వారి ప్రయాణ ప్రణాళికలు అకస్మాత్తుగా మారితే వారు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ టిక్కెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇటువంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి. జపాన్, యూకే, యూరప్‌లలో ప్రయాణికులు ఇలాంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వేలు కూడా ఈ దిశగా కదులుతున్నాయి. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాన్ని అందిస్తున్నాయి.




