Medicine Prices Hike: వినియోగదారులకు షాక్.. భారీగా పెరగనున్న ఈ మందుల ధరలు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
మార్చి నెల ముగియబోతోంది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ నెల రాబోతోంది. దీంతో ఎన్నో నిబంధనలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ నెల నుంచి సామాన్యుల జేబులకు చిల్లులు పడనున్నాయి. ఎంతోకంటే నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. పెరిగిన మందుల ధరలు..
మార్చి నెల ముగియబోతోంది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ నెల రాబోతోంది. దీంతో ఎన్నో నిబంధనలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ నెల నుంచి సామాన్యుల జేబులకు చిల్లులు పడనున్నాయి. ఎంతోకంటే నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12 శాతం మేర పెరగనున్నాయి. పెరిగిన మందుల ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, అనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతోపాటు పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీఇన్ఫెక్టివ్స్ వంటివి ఉన్నాయి. తాజా పెంపు ప్రభావం జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని 800కుపైగా మందులపై పడనుంది.
27 రకాల చికిత్సలకు సంబంధించిన సుమారు 900 మిశ్రమాలలో వినియోగించే 384 పదార్థాల ధరలు 12 శాతం పెరిగినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలే ఈ ధరల పెంపునకు కారణమని తెలుస్తోంది. మందుల్లో ఉపయోగించే ముడిపదార్థాలు, ఏపీఐ రేట్లు పెరిగిన నేపథ్యంలో ధరల పెరుగుదలకు అనివార్యమైంది. అలాగే సరుకుల రవాణాతోపాటు ప్యాకింగ్ ధరలు కూడా పెరగనున్నట్లు సదరు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీల లైసెన్స్‌లు రద్దు
మరో వైపు 18 ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్రం షాకిచ్చింది. నకిలీ మందులను తయారు చేస్తున్న 18 ఫార్మాస్యూటికల్ కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేసింది కేంద్రం. గత సంవత్సరం అక్టోబర్ నుంచి అమెరికా, ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాల్లో భారత్ కంపెనీ నకిలీ ఔషధాల వ్యవహారం బట్టబయలు కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ పరిధిలోని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించింది. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, బీహార్, గుజరాత్, గోవా, హర్యానా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో 70 కంపెనీలపై తనిఖీలు జరుగగా, ఉత్తారఖండ్, 45, మధ్యప్రదేశ్‌లో 23 కంపెనీలలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. మొదటి దశలో చేపట్టిన తనిఖీల్లో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు తేలడంతో 18 కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు కేంద్ర అధికారుల ద్వారా సమాచారం.