Maruti Suzuki Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..
భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ నుండి వివిధ కార్ల మోడళ్లకు ధరలను పెంచేందుకు నిర్ణయించింది.

భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ నుండి వివిధ కార్ల మోడళ్లకు ధరలను పెంచేందుకు నిర్ణయించింది. వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
“గత సంవత్సరంలో వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల తయారీ వ్యయం అధికంగా పెరిగింది. అందువల్ల, ఏప్రిల్‌లో ధరల పెరుగుదల అనివార్యమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ప్రభావాన్ని వినియోగదారులకు ఇవ్వడం కంపెనీకి అత్యవసరం. ”అని మారుతి సుజుకి మార్చి 22న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
జనవరి 18 న కూడా సంస్థ తన వాహనాల ధరలను ఢిల్లీలో రూ .34 వేల రూపాయల వరకు పెంచినట్లు ప్రకటించింది. ఆల్టో ధరను 9,000 రూపాయలకు పెంచింది. ఎస్ప్రెస్సో ధరను 7,000 రూపాయలు పెంచింది. బాలెనో ధరను రూ .19,400 వరకు పెంచారు. వాగన్ఆర్, బ్రెజ్జా , సెలెరియో వంటి మోడళ్ల ధరలను జనవరిలో పెంచింది.
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఫిబ్రవరి 2021 లో హోల్‌సేల్స్‌లో 11.8 శాతం పెరిగి 1,64,469 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 1,47,110 యూనిట్లుగా ఉంది. మారుతీ కార్ల దేశీయ అమ్మకాలు గత నెలలో 11.8 శాతం పెరిగి 1,52,983 యూనిట్లకు చేరుకోగా, 2020 ఫిబ్రవరిలో 1,36,849 యూనిట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎగుమతులు 11.9 శాతం పెరిగి 11,486 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 10,261 యూనిట్లు నమోదయ్యాయి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ నెల ఎండింగ్ లోపు మారుతీ కొత్త కారు కొంటే కాస్త సేఫ్ అనమాట. వచ్చే నెల మొదలైతే కాస్త వాయింపు అధికంగానే ఉంటుంది.
Also Read: 74-year-old Canadian Grandma: ఆమె వయస్సు 74 సంవత్సరాలు.. ఈ విషయం చెబితే ఎవరైనా నమ్మగలరా…?