AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI E-Mudra: ఎస్‌బీఐ ముద్రా రుణంతో వ్యాపారంలో మీ ముద్ర వేయండి.. దరఖాస్తు, అర్హత వివరాలివే..!

ఎస్‌బీఐ ముద్రా రుణాలు వ్యాపార రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు వ్యక్తులు, స్వయం ఉపాధి నిపుణులు, మైక్రో-యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐలో సేవింగ్ లేదా కరెంట్ ఖాతాలు కలిగి ఉన్న ప్రస్తుత కస్టమర్‌లు ఈ-ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI E-Mudra: ఎస్‌బీఐ ముద్రా రుణంతో వ్యాపారంలో మీ ముద్ర వేయండి.. దరఖాస్తు, అర్హత వివరాలివే..!
Bank Loan
Nikhil
| Edited By: Subhash Goud|

Updated on: Aug 16, 2023 | 4:32 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వర్ధమాన పారిశ్రామికవేత్తలకు ఎస్‌బీఐ ఈ-ముద్ర రుణాన్ని అందిస్తోంది . ఎస్‌బీఐ ముద్రా రుణాలు వ్యాపార రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు వ్యక్తులు, స్వయం ఉపాధి నిపుణులు, మైక్రో-యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐలో సేవింగ్ లేదా కరెంట్ ఖాతాలు కలిగి ఉన్న ప్రస్తుత కస్టమర్‌లు ఈ-ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్ర పథకం కింద ఎస్‌బీఐ వ్యాపార రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. అన్ని ఎస్‌బీఐ శాఖల్లో ముద్ర రుణాన్ని అందించడానికి అధికారం కలిగి ఉన్నాయి.

ఎస్‌బీఐ ఈ-ముద్రా లోన్ అంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన రుణగ్రహీతలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనేక ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు ఊతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముద్ర రుణాలను అందిస్తుంది. ఎస్‌బీఐ ఏప్రిల్ 8 , 2015న ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై)ని రూ. 10 లక్షల వరకు రుణాలతో కార్పొరేట్, వ్యవసాయేతర ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు క్రెడిట్ సౌకర్యాలను అందించడానికి ప్రారంభించారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన అనేది వ్యాపార అవసరాలు, విస్తరణ, కంపెనీ ఏర్పాటు లేదా స్థాపనను ఆధునికీకరించడం మొదలైన వాటి కోసం నిధులు అవసరమయ్యే వ్యక్తులకు అందుబాటులో ఉండే కొలేటరల్-ఫ్రీ లోన్‌గా అందిస్తారు. ఈ క్రెడిట్ కొత్త వ్యాపార విభాగాన్ని స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగించవచ్చు.

అర్హతలివే 

ఈ-ముద్ర లోన్‌లు కొత్త ఎంటర్‌ప్రైజ్‌ని ప్రారంభించాలనుకునే వ్యవస్థాపకులకు అలాగే తమ కార్యకలాపాలను విస్తరించాలని కోరుకునే లాభదాయక సంస్థలకు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నాన్-కార్పొరేట్ స్మాల్ బిజినెస్ సెగ్మెంట్‌లో పనిచేస్తున్న వ్యక్తులు రుణానికి అర్హులు. ఈ విభాగంలో ఏకైక యాజమాన్యాలు, భాగస్వామ్యాలు ఉన్నాయి. వీరు చిన్న తయారీ యూనిట్లు, సేవా రంగ యూనిట్లు, షాపు యజమానులు, ఉత్పత్తి విక్రేతలు, ట్రక్ డ్రైవర్లు, ఫుడ్ సర్వీస్ ఆపరేటర్లు, మరమ్మతు దుకాణాలు, మెషిన్ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, కళాకారులు, ఆహార ప్రాసెసర్లు వంటివి ఏర్పాటు చేసుకోవడానికి ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ పత్రాలు తప్పనిరి

ఎస్‌బీఐ ఈ-ముద్ర లోన్‌ పొందడానికి కొన్ని పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఉద్యోగ ఆధార్, ఎస్‌బీఐ ఖాతా వివరాలు, దుకాణం, ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ వివరాలు, కిషోర్, తరుణ్ ముద్ర లోన్ వర్గం, పాస్‌పోర్ట్ పరిమాణంలో దరఖాస్తుదారుని ఫోటోలు, ఓటరు ఐడీ, పాన్ కార్డ్, ఆధార్ లేదా పాస్‌పోర్ట్, రెసిడెన్సీ రుజువు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు (గత ఆరు నెలలు), పరికరాలు లేదా యంత్రాల కొనుగోలు కోసం ధర కొటేషన్, మునుపటి రెండు సంవత్సరాల బ్యాలెన్స్ షీట్, అలాగే లాభ, నష్ట ప్రకటన వివరాలు, భాగస్వామ్య ఒప్పందం, చట్టపరమైన పత్రాలు అవసరం అవుతాయి.

దరఖాస్తు విధానం ఇలా

  • స్టెప్‌- 1: ఎస్‌బీఐ ఈ-ముద్ర అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • స్టెప్‌- 2: హిందీ లేదా ఇంగ్లీషులో ఇచ్చిన అన్ని సూచనలను చదవి, తదుపరి పేజీని కొనసాగించడానికి “సరే” ఎంపికపై క్లిక్ చేయండి.
  • స్టెప్‌- 3: మీ మొబైల్ నంబర్, మీ ఖాతా నంబర్, లోన్ మొత్తాన్ని నమోదు చేయండి.
  • స్టెప్‌- 4: ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌- 5: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను పూరించాలి.
  • స్టెప్‌- 6: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • స్టెప్‌- 7: ఈ-ముద్ర నిబంధనలు, షరతులను ఈ-సైన్‌తో ఆమోదించాలి.
  • స్టెప్‌- 8: మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • స్టెప్‌- 9: మీ దరఖాస్తును పూర్తి చేయడానికి అవసరమైన ఫీల్డ్‌లో ఓటీపీని నమోదు చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి