LPG Subsidy Updates: మీకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ రావడం లేదా..? కారణాలు ఏంటో తెలుసుకొని ఇలా చేయండి..!
LPG Subsidy Updates: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది. గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సబ్సిడీ వారి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా..
LPG Subsidy Updates: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది. గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సబ్సిడీ వారి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా సబ్సిడీ వేయడం నిలిపివేసింది ప్రభుత్వం. ఇక అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ఎల్‌పీజీ సబ్సిడీని ప్రభుత్వం మరోసారి జమ చేయడం ప్రారంభించింది ప్రభుత్వం. కొంత మంది లబ్దిదారులకు సిలిండర్‌పై సబ్సిడీ రూ.158.52 లేదా రూ.237.78గా ఉంది. ఇక సబ్సిడీ మీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యిందో లేదో.. mylpg.in వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు. అయితే కొందరికి సబ్సిడీ రావడం లేదు. సబ్సిడీ పొందేందుకు అర్హత ఉన్నా.. కొందరికి ఖాతాలో జమ కావడం లేదు. కొన్ని తప్పుడు చేయడం వల్ల మీకు సబ్సిడీ అమోంట్ రాకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా డబ్బులు రావు. అయితే ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ ఎవ్వరికి ఇవ్వాలో.. ఎవ్వరికి ఇవ్వకూడదో నిబంధనలు ఫిక్స్ అయ్యాయి. మీ ఖాతాకు సబ్సిడీ డబ్బులు రాకపోతే ఎందుకు రావడం లేదో తెలుసుకుందాం.
సబ్సిడీ రాకపోవడం చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా మీ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయకపోవడం. అలాగే మీ బ్యాంకు ఖాతా సరిగ్గా నమోదు చేశారో లేదో చెక్ చేసుకోండి. మీరు ఎల్‌పీజీ గ్యాస్ నెంబర్, ఆధార్, పాన్ ఇతర వివరాలు సరిగ్గా నమోదు చేయకపోతే కూడా మీకు సబ్సిడీ డబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు. అలాంటి సమయంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో చెక్ చేసి వివరాలు సరిగ్గా నమోదు చేసుకోవచ్చు.
► ముందుగా మీరు www.mylpg.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. ► ఆ తర్వాత కుడివైపున ఉన్న మూడు కంపెనీల సిలిండర్ ఫోటోలు కనిపిస్తాయి. ► మీ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ► దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ సమాచారం ఉంటుంది. ► ఎగువ కుడి వైపున సైన్-ఇన్, కొత్త వినియోగదారుల ఎంపిక ఉంటుంది. దానిని ఎంచుకోండి ► మీరు ఐడీ ఇప్పటికే నమోదు చేసినట్లయితే సైన్-ఇన్ చేయాలి. ►ఐడీ (ID) లేకపోతే మీరు కొత్త వినియోగదారుని ఆప్షన్ ఎంచుకోవాలి. ► ఆ తర్వాత కుడివైపు వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ► మీరు సబ్సిడీ పొందుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. ► మీకు సబ్సిడీ రాకపోతే 18002333555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
సబ్సిడీ ఆగిపోవడానికి మరి కొన్ని కారణాలు..! సబ్సిడీ ఆగిపోవడానికి ఆధార్ అనుసంధానం కాగా, ఇతర కారణాలు కూడా ఉంటాయి. మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా సబ్సిడీ రాదు. మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షల లోపు ఉండాలి. మీ ఆదాయం రూ.10 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మీ భార్య లేదా భర్త కూడా సంపాదించి ఇద్దరి ఆదాయం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా సబ్సిడీ వర్తించదని గమనించాలి.
మీకు ఎంత సబ్సిడీ వస్తుంది? ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ చాలా తక్కువగానే ఉంది. సిలిండర్‌పై రూ.200 వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారుల ఖాతాలో రూ.79.26 మాత్రమే సబ్సీడీ వస్తోంది. ఇప్పుడు వినియోగదారులు సిలిండర్‌పై తక్కువ సబ్సిడీ పొందుతున్నారు. ప్రతి నెల సిలిండర్ ధర పెరుగుతున్న కారణంగా సబ్సిడీ కూడా తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి: