SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ భారీ షాక్‌.. కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!

SBI: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బ్యాంకు కస్టమర్ల విషయాలలో బ్యాంకులు నిర్లక్ష్యం వహించినా..

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ భారీ షాక్‌.. కోటి రూపాయల జరిమానా.. ఎందుకంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 27, 2021 | 9:07 AM

SBI: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బ్యాంకు కస్టమర్ల విషయాలలో బ్యాంకులు నిర్లక్ష్యం వహించినా.. నిబంధనలు తుంగలో తొక్కినా ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతోంది. ఆర్బీఐ విధించిన నిబంధనలను పాటించకపోతే బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (SBI)కి రిజర్వ్‌ బ్యాంకు కోటి రూపాయల జరిమినా విధించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు ఒక ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్దంగా రుణగ్రహీత కంపెనీల్లో బ్యాంకుకు షేర్లున్నట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్‌ 19లో సబ్‌-సెక్షన్‌ ప్రకారం ఆర్బీఐ ఈ జరిమానా వేసింది. ఏ బ్యాంకింగ్‌ కంపెనీ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా, లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్‌ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు. అనంతరం ఆదేశాలను ఉల్లంఘించినందుకు దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది.

కాగా, ఇలా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ఇటీవల ముంబైలో ఉన్న అప్నా సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై రూ.79 లక్షల జరిమానా విధించింది. ఆదాయం, ప్రొవిజనింగ్‌, ఇతర సంబంధిత విషయాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, డిపాజిట్‌ ఖాతాల నిర్వహణపై ఆర్బీఐ ఆదేశాలు పాటించనందున ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మర్యాదిత్‌కు లక్ష రూపాయల జరిమాని విధించింది. నో యువర్‌ కస్టమర్ (కైవైసీ) నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది.

అలాగే ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం కో ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకుకు కూడా ఆర్బీఐ రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందున ఈ జరిమానా విధించింది. ఆదాయం గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులు, ఇతర అంశాలపై మాస్టర్‌ సర్క్యూలర్‌, పట్టణ సహకార బ్యాంకుల డైరెక్టర్ల బోర్డుపై మాస్టర్‌ సర్క్యూలర్‌ ఉల్లంఘనలపై ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇవే బ్యాంకులకు కాకుండా మరెన్నో బ్యాంకులకు జరిమానా విధించింది ఆర్బీఐ. నిబంధనలు పాటించకపోతే ఇలాగే జరిమానాలు, ఇతర ఆంక్షలు ఉంటాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

LPG Subsidy Updates: మీకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ రావడం లేదా..? కారణాలు ఏంటో తెలుసుకొని ఇలా చేయండి..!

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారి సంఖ్యను పెంచేందుకు అనుమతి..!