సామాన్యుడికి బిగ్ షాక్.. పెరగనున్న ఇన్స్యూరెన్స్ పాలసీ ధరలు.. దానికి సంబంధించిన ఈ 5 ముఖ్యమైన విషయాలు ఇవే

సామాన్యుడికి బిగ్ షాక్.. పెరగనున్న ఇన్స్యూరెన్స్ పాలసీ ధరలు.. దానికి సంబంధించిన ఈ 5 ముఖ్యమైన విషయాలు ఇవే

కోవిడ్ వ్యాప్తి సమయంలో మరణాలు వేగంగా పెరిగినప్పుడు ప్రజలు బీమా పొందడం గురించి తెలుసుకున్నారు. పాలసీబజార్ ఇటీవలి ఓ సంచలన నివేదికను..

Sanjay Kasula

|

Dec 02, 2021 | 3:04 PM

Insurance Premium Hike Soon: కోవిడ్ వ్యాప్తి సమయంలో మరణాలు వేగంగా పెరిగినప్పుడు ప్రజలు బీమా పొందడం గురించి తెలుసుకున్నారు. పాలసీబజార్ ఇటీవలి ఓ సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక  ప్రకారం కోవిడ్ తర్వాత బీమా గురించి సమాచారాన్ని కోరుకునే వారి సంఖ్య ఏడు రెట్లు పెరిగిందని తెలిపింది. గతంలో కేవలం 10 శాతం మంది మాత్రమే బీమాను కొనుగోలు చేయాలని భావించగా.. ఇప్పుడు 71 శాతం మంది బీమా కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు.

(1) ఇన్సూరెన్స్ సమాధాన్ సహ వ్యవస్థాపకుడు శైలేష్ కుమార్ ఒక స్థూల అంచనాను ఇచ్చారు. కంపెనీలు ఒక సంవత్సరంలో 3000-4000 డెత్ క్లెయిమ్‌లను కలిగి ఉంటే కోవిడ్ వ్యాప్తి సమయంలో 20,000 డెత్ క్లెయిమ్‌లు వచ్చాయి. ఈ పెరుగుదల రీ-ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టం కలిగించే ఒప్పందంగా పరిగణించబడింది.

(2) రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే మన బీమా కంపెనీ ప్రీమియం చెల్లింపుపై బీమాను తిరిగి బీమా చేస్తుంది. అంటే మన బీమాపై పెద్ద కంపెనీల నుంచి తనకు తానుగా బీమాను కొనుగోలు చేస్తుంది. మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు రీ-ఇన్సూరెన్స్ కంపెనీ ఆ డబ్బును మన బీమా కంపెనీకి ఇస్తుంది. మ్యూనిచ్ రీ, లాయిడ్ స్విస్ వంటి దాదాపు 10 విదేశీ రీఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యాపారంలో పాలుపంచుకుంది.

(3) ఈ కంపెనీలకు భారత్‌లో మాత్రమే బీమా క్లెయిమ్‌లు లేవు కానీ బీమా క్లెయిమ్‌లు ప్రపంచం నలుమూలల నుండి వస్తాయి. కోవిడ్ కారణంగా ప్రతి మార్కెట్‌కు ఎక్కువ క్లెయిమ్‌లు వచ్చాయి. కానీ భారతదేశంలో ఎక్కువ క్లెయిమ్‌లు సమస్యగా ఉండటమే కాకుండా వేరే రకమైన నష్టాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. నష్ట ఒప్పందాన్ని చూసి, రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంను ఖరీదైనవిగా చేశాయి. ఆరోగ్య బీమా ఖరీదు కావడానికి ఇదే కారణం.

(4) వార్షిక ప్రీమియం 15,000లో 25% పెరిగితే మన జేబులో నుండి రూ. 3750 ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది. ప్రీమియంలో 30 శాతం పెంపు ఉంటే అప్పుడు ప్రీమియం రూ.4500 పెరుగుతుంది. 40 శాతం పెరిగితే ప్రీమియం రూ. 6000 పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి: Amazing Video: ఇంతకాలం చిరుత వేటాడం మాత్రమే చూశాం.. అక్కడ లెక్క తప్పింది..

Health Tips: డయాబెటీస్ బాధితులు రోజు వీటిని తినడం మరిచిపోవద్దు.. అవేంటో తెలుసా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu