Maruti Suzuki: ఇకపై మారుతీ కారు కొనాలంటే షాకే.. భారీగా పెరగనున్న ధరలు.. ఎప్పటినుంచి అంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Maruti Suzuki: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది. కంపెనీ ధరను పెంచడానికి కారణం కారు తయారీలో ఉపయోగించే ఖరీదైన ముడిసరుకు. ఈ ముడిసరుకుల ధరలు గత సంవత్సరం నుంచి ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పెరిగిన ఇన్‌పుట్ ఖర్చు భారాన్ని వినియోగదారులపై మోపాలని కంపెనీ ఇప్పుడు యోచిస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబరు వరకు మూడుసార్లు ధరలను పెంచిన కంపెనీ
ఇన్‌పుట్ ఖర్చులు, సెమీకండక్టర్ల కొరత కారణంగా చాలా ఆటో రంగ కంపెనీలు తీవ్ర నిరాశకు గురయ్యాయని నివేదిక పేర్కొంది. దీని కారణంగా, కంపెనీలు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం చూడటం లేదు. నవంబర్ 30 న, మారుతీ ఈకో వ్యాన్ నాన్-కార్గో వేరియంట్ ధరలను రూ. 8,000 పెంచింది. దీనికి కార ణం వాటిలో వాడిన ఎయిర్ బ్యాగ్స్ గా కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌లో కూడా, మారుతీ సెలెరియో మినహా అన్ని మోడళ్ల ధరలను 1.9% పెంచింది. 2021లో కంపెనీ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి.
ఏప్రిల్‌లో, కంపెనీ అన్ని మోడళ్ల ధరలను 1.6% పెంచింది. మారుతీ సుజుకీ ఇంతకు ముందు ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో ధరలను పెంచింది. జనవరి 18న, వాహన తయారీ సంస్థ కొన్ని మోడళ్ల ధరలను రూ.34,000 పెంచింది. అలాగే, ఏప్రిల్ 16న, అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలను 1.6% పెంచింది.
చిప్స్ లేకపోయినా మారుతీ సుజుకీ అమ్మకాలు పెరిగాయి..
ఆటోమొబైల్ కంపెనీలు నవంబర్ సేల్స్ గణాంకాలను నిన్న విడుదల చేశాయి. ఇందులో, మారుతి అమ్మకాలు నవంబర్‌లో నెలవారీ ప్రాతిపదికన 0.61% పెరిగి 1,39,184 యూనిట్లకు చేరుకున్నాయి. సెమీకండక్టర్లు లేదా చిప్‌ల కొరత కారణంగా తమ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ ఎగుమతులు నెలవారీ ప్రాతిపదికన 0.33% పెరిగి 21,393 యూనిట్లకు చేరుకున్నాయి. మినీ, కాంపాక్ట్ వాహనాల సెగ్మెంట్ అమ్మకాలు 5.6% పెరిగి 74,492 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే యుటిలిటీ వాహనాల విక్రయాలు 9.25% తగ్గి 24,574 యూనిట్లకు చేరాయి.
ఇవికూడా చదవండి: Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..
Viral news: మూగజీవిపై అమానుషం.. కుమారుడిని కరిచిందని శునకాన్ని కర్కశంగా హతమార్చిన వైనం..