Yamaha Aerox 155 S: యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్… స్పోర్టీ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్
తాజాగా యమహా కంపెనీ ఏరోక్స్ 155 ఎస్ పేరుతో సూపర్ స్పోర్టీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను రూ. 1.50 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పరిచయం చేసింది. యమహా కంపెనీ తన 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ స్మార్ట్ కీ టెక్నాలజీతో పట్టణ రైడర్లకు మెరుగైన సౌలభ్యం, భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవల కాలంలో భారతదేశంలో స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్లు మగ, ఆడవారు ఇద్దరూ నడిపేలా డిజైన్ ఉండడంతో మధ్య తరగతి ప్రజలు స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈవీ వాహనాల విషయంలో కూడా స్కూటర్లే అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సూపర్ ఫీచర్స్‌తో స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా యమహా కంపెనీ ఏరోక్స్ 155 ఎస్ పేరుతో సూపర్ స్పోర్టీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను రూ. 1.50 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పరిచయం చేసింది. యమహా కంపెనీ తన ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ బ్రాండ్ ప్రచారంలో భాగంగా ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ స్మార్ట్ కీ టెక్నాలజీతో పట్టణ రైడర్లకు మెరుగైన సౌలభ్యం, భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ మ్యాక్సీ-స్కూటర్‌ను రేసింగ్ బ్లూ, సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. ఈ నేపథ్యంలో యమహా ఏరోక్స్ 155 ఎస్ స్కూటర్ గురించి ఓ సారి తెలుసుకుందాం.
యమహా ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ అత్యంత వినూత్నమైన కొత్త ఫీచర్ ఆన్సర్ బ్యాక్, అన్లాక్, ఇమ్మొబిలైజర్‌తో సహా స్మార్ట్ కీ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫీచర్ల జోడింపు ఈ స్కూటర్‌కు సంబంధించిన ప్రాక్టికాలిటీని పెంచుతుంది. ఈ స్కూటర్‌లోని ఆన్సర్ బ్యాక్ ఫీచర్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే కీలెస్ ఇగ్నిషన్ స్కూటర్‌ను ప్రారంభించడాన్ని సులభతరం చేస్తుంది. అనధికారిక యాక్సెస్ లేదా దొంగతనం నుంచి రక్షణను నిర్ధారించే ఒక ఇమ్మొబిలైజర్‌ను చేర్చడంతో ఈ స్కూటర్‌కు సంబంధించిన భద్రత మరింత బలపడుతుంది.
యమహా ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్ ఒక సొగసైన డిజైన్‌తో వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), కొత్త తరం 155 సీసీ ఇంజిన్‌తో వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (వీవీఏ) 14.79 బీహెచ్‌పీ, 13.9 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ స్టేజ్ 2 బీఎస్-6 కంప్లైంట్, ఈ20 ఇంధనానికి మద్దతు ఇస్తుంది. ఇది ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ-II) సిస్టమ్, ప్రమాద వ్యవస్థను ప్రామాణికంగా కూడా కలిగి ఉంది. ఈ స్కూటర్ లాంచ్‌కు సంబంధించి యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఈషిన్ చిహానా మాట్లాడుతూ స్మార్ట్ కీ టెక్నాలజీని పరిచయం చేయడం ద్వారా సౌలభ్యం, యుటిలిటీని సజావుగా మిళితం చేశామని వివరించారు. యమహా ఏరోక్స్ 155 ఎస్ పనితీరు వల్ల రైడర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..